మూడేళ్లు ఆ నిర్మాత కారణంగా చాలా నష్టపోయాను.. కలర్ ఫొటో హీరోయిన్
ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు స్టార్ హీరోయిన్ అవ్వడం అనేది చాలా రేర్. నార్త్ అండ్ కన్నడ హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువవ్వడంతో తెలుగమ్మాయిల హవా చాలా తగ్గిందనే చెప్పాలి. ఒకవేళ వారుస హిట్స్ కొడుతున్నా కూడా వారి రేంజ్ కొంత వరకే ఉంటోంది. ఇక ఇటీవల కలర్ ఫొటో సినిమాతో హిట్ అందుకున్న చాందిని చౌదరి కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలని అనుకుంటోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఒక అగ్ర నిర్మాత వలన ఎదుర్కొన్న ఇబ్బంది గురించి బయటకు చెప్పింది.

ఆ సినిమాతో మంచి క్రేజ్
గత నాలుగైదేళ్లుగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న చాందిని మొత్తానికి కలర్ ఫొటో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆహా యాప్ లో విడుదలైన ఆ సినిమా నటీనటులకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. చాందిని ముందు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదట ఒక మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె అవకాశాల కోసం కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొందట.

రాజ్ తరుణ్ చాలా క్లోజ్..
రాజ్ తరుణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు అతనితో కూడా చాందిని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అప్పుడే ఆ ఇద్దరికి మంచి క్రేజ్ దక్కింది. రాజ్ తరుణ్ హీరో అయినా తరువాత కూడా తనకు చాలా క్లోజ్ అని చెప్పిన చాందిని ఒకసారి సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని తెలిపింది.
శృంగారం ఒలకబోస్తున్న యువ హీరోయిన్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా

ఒక నిర్మాత కారణంగా.. ఇబ్బంది పడ్డాను
చాందిని మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది. ఒక నిర్మాత కారణంగా నేనైతే మూడేళ్లు మంచి మంచి అవకాశాలు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. మొదటి సినిమా వారి బ్యానర్ లోనే చేయాలనే ఒక అగ్రిమెంట్ ఉండడం వలన కొంత మోసపోయాను. ఏమైందో ఏమో గాని మూడేళ్లయినా ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు.. అని వివరించింది.

పెద్ద గొడవ జరిగింది
మొదటి సినిమా సెట్స్ పైకి రావడం లేదని ఆ తరువాత వేరే సినిమాలు చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ అగ్రిమెంట్ వలన పెద్ద గొడవ జరిగింది. అందుకే మూడేళ్లు వేరే సినిమా చేయలేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఏడెనిమిది ప్రయత్నాలు చేస్తేనే అందులో ఒక అవకాశం దొరుకుంది. ఆ నిర్మాత వలన మంచి మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని.. చాందిని తెలిపింది.


Click it and Unblock the Notifications











