దీపిక పదుకోన్ భంగిమ వైరల్.. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 12 లక్షల లైక్స్
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపిక పదుకోన్ చాలా రోజుల తర్వాత మరోసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. మే 2వ తేదీన ఆమె చివరిసారిగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయడం గమనార్హం. దాదాపు రెండు నెలలపాటు ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.
అయితే దీపిక పదుకోన్ సోషల్ మీడియాకు దూరం కావడంపై.. కోవిడ్ బారిన పడ్డారని.. అందుకే ఆమె కొంతకాలం బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు అనే కథనాలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. అలాంటి రూమర్ల మధ్య దీపిక మళ్లీ సోషల్ మీడియాలోకి రావడం చర్చనీయాంశమైంది.

తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో యోగా చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. Expectation vs Reality అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేసింది. ఓ చిరునవ్వుతో కూడిన ఎమోజీని పోస్టు చేసింది. అంతా క్షేమమే అన్నట్టు సిగ్నల్ ఇచ్చింది.
ఇక దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. కపిల్ దేవ్ జీవిత కథను తెరకెక్కిస్తూ రూపొందిస్తున్న 83 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఇంటెర్న్ అనే హలీవుడ్ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా షారుక్ ఖాన్, జాన్ అబ్రహం నటిస్తున్న పఠాన్ చిత్రంలో లీడ్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











