For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ ఇంట తిష్ట వేసిన కరోనా.. పది మందికి పాజిటివ్.. భయమేస్తోందంటూ ఎమోషనల్!

  |

  భారతదేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు భారీ ఎత్తున కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి ఒక హీరోయిన్ ఇంట తిష్ట వేసింది, ఆమె ఇంట్లో ఏకంగా పది మంది కరోనా బారిన పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఐటెం సాంగ్ తో ఫేమస్

  ఐటెం సాంగ్ తో ఫేమస్

  గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపింది డింపుల్ హయాతి. చెన్నైకి చెందిన ఈ భామ ఆ సినిమాలో తనదైన అందాలు ఆరబోసి టాలీవుడ్లో సెన్సేషనల్ ఐటెమ్ భామగా నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఆకర్షించే ఈ భామ ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది.

  హీరోయిన్ గా ఎంట్రీ

  హీరోయిన్ గా ఎంట్రీ

  నిజానికి 2017 లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత యురేకా, దేవి, అధినేత్రి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా నటిస్తోంది.

  వరుస అవకాశాలు

  వరుస అవకాశాలు

  ఈ చెన్నై పొడుగుకాళ్ల సుందరి నిజానికి ముందుగా హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ చిన్న చిన్న సినిమాలలో తప్ప పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కలేదు. ఎప్పుడైతే గద్దల కొండ గణేష్ సినిమాలో జరా జరా పాట లో నర్తించి ఫేమస్ అయిందో అప్పటినుంచి ఈ భామకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

  హీరోయిన్ గా బిజీ

  హీరోయిన్ గా బిజీ

  ఈ భామ ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయిన నేపథ్యంలో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తెలుగు, తమిళ భాషలలోనే కాక హిందీ లో కూడా ఈ భామ ఎంట్రీ ఇస్తోంది ఇప్పటికే హిందీలో కార్తిక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తుండగా, ఈ మధ్య కాలంలో తమిళంలో విశాల్ కొత్త సినిమాలు కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

  హైదరాబాద్ లో లాక్

  హైదరాబాద్ లో లాక్

  ఇక చెన్నైలో నివాసం ఉండే ఈ భామ ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ చేరుకుంది. అయితే ఆమె చేరుకున్నాక అటు తమిళనాడులో అలాగే ఇటు తెలంగాణలో సైతం లాక్ డౌన్ విధించారు. అయితే చెన్నై లో ఉన్న ఆమె కుటుంబంలో కరోనా కలకలం రేగినట్లు సమాచారం అందుతోంది. ఆమె కుటుంబం ఉమ్మడి కుటుంబం కావడంతో దాదాపు పది మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

  ఇంట్లో పది మందికి కరోనా

  ఇంట్లో పది మందికి కరోనా

  తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని పేర్కొన్న డింపుల్ కుటుంబంలో ఉన్న అందరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని పేర్కొంది. కుటుంబంలో ఉన్న పది మంది కరోనా బాధపడుతున్నారని తన తాతగారు అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయనను వైద్యులు చాలా శ్రద్ధగా ట్రీట్ చేస్తున్నారని ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. వారం నుంచి ఇది మెంటల్ గా ఫిజికల్ గా ఇబ్బంది పెడుతోందని, పరిస్థితి భయంకరంగా ఉందని ఆమె పేర్కొంది.

  English summary
  Actress Dimple Hayathi is in a tension, because she has just returned from Tamil Nadu, where she was shooting for a recently-launched Tamil film. “We shot for a few days. We were supposed to shoot till May 20, but then the lockdown was imposed. I was worried when I heard the news, and hurried back to Hyderabad on Monday,” Dimple shares the message in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X