Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోతో రెచ్చిపోయిన హీరోయిన్.. ఏకంగా మీదికెక్కి.. ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే! హాట్ ఇష్యూ
సినిమా అన్నాక నటీనటులకు రిహాల్సస్ కామన్. ఆ మేరకు సన్నద్దమయితే గానీ సీన్ అనుకున్నట్లుగా పండే అవకాశం ఉండదు. ముద్దు సీన్లు, అడల్ట్ సన్నివేశాలకు కూడా ఇలాంటి రిహాల్సస్ ఉంటాయా? అనే దానికి సమాధానమే ఈ వార్త. ఓ సినిమాలో లాంగ్ లిప్‌లాక్ సీన్ కోసం హీరోహీరోయిన్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ హీరో హీరోయిన్ ఎవరు? వివరాల్లోకి పోతే..

వేగంగా మలాంగ్ ప్రమోషన్స్.. ఒక్కో పోస్టర్
మలాంగ్ సినిమాలో లిప్‌లాక్ సీన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2013లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఆషికీ 2 తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య రాయ్ కపూర్ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. సినిమాలోని నటీనటులను పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు.

దిశా పటానిని ఎత్తుకుని లిప్ కిస్
ఈ మేరకు మలాంగ్ నుంచి తాజాగా విడుదల చేసిన లిప్‌లాక్ సీన్ పోస్టర్ నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని తన భుజాలపై ఎత్తుకుని హీరో ఆదిత్య రాయ్ కపూర్ గాఢంగా లిప్ కిస్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ పిక్ చూసి నెటిజన్లు ఈ ఫొటోకు లైక్స్, కామెంట్లు పోస్ట్ చేస్తూ ఈ పిక్ వైరల్ చేశారు.
|
ఇదే కాదు ఇంకా ఘాటు సీన్స్.. స్పెషల్ ట్రైనింగ్
కాగా ప్రస్తుతం బీ టౌన్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. పోస్టర్‌లో రిలీజ్ చేసిన సీనే కాకుండా సినిమాలో మరికొన్ని ఘాటు హాటు ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటిలో ఓ కిస్ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అండర్ వాటర్‌లో ఓ లాంగ్ కిస్ సీన్ ఉంది. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు శిక్షణ ఇచ్చి పెర్ఫార్మ్ చేయించారట.
|
సింగిల్ షాట్‌లోనే ఆ ముద్దు
హీరోహీరోయిన్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి.. సింగిల్ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట చిత్రయూనిట్. దీంతో ఈ వార్తల నడుమ మలాంగ్ సినిమా విశేషాలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి జనవరి 6న ట్రైలర్ విడుదల కానుంది.

హీరోయిన్ ఫీలింగ్స్
ఇక హీరోయిన్ దిశా పటాని ఈ స్పెషల్ ట్రైనింగ్ పై తన ఫీలింగ్స్ పంచుకుంది. ''ట్రైనింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్'' అంటూ సోషల్ మీడియాలో హాట్ పిక్ షేర్ చేసింది. ఫిబ్రవరి 7న మలాంగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.