For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్ పార్టును చూపించిన హీరోయిన్: జూమ్ చేసి.. సర్కిల్ గీసి.. అందుకే స్పెషలంటూ!

  |

  గతంలో సినీ సెలెబ్రిటీలకు పర్సనల్ అంటూ ఉండేది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో సీక్రెట్లు ముందే లీకైపోతున్నాయి. అవి సినిమా విషయాలు కావొచ్చు.. పర్సనల్ అంశాలు కావొచ్చు. ఇట్టే బయటకు వచ్చేస్తున్నాయి. అనుకోకుండా కొందరు తమ రహస్యాలను బయట పెడుతుంటే.. కొందరు మాత్రమే కావాలనే రివీల్ చేస్తున్నారు. ఇప్పుడదే చేసింది బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశ పటానీ. తాజాగా ఫ్యాన్స్‌తో చాట్ చేసిన ఆమె.. ఓ నెటిజన్ అడగ్గానే జూమ్ చేసి.. సర్కిల్ గీసి మరీ బాడీలోని సీక్రెట్ పార్టును చూపించేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ప్రవేశం

  తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా ప్రవేశం

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘లోఫర్'. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే దిశా పటానీ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో దిశాకు నిరాశనే ఎదురైంది.

  ఎంఎస్ ధోనీతో మారిన కెరీర్... ప్రశంసలు

  ఎంఎస్ ధోనీతో మారిన కెరీర్... ప్రశంసలు

  మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ వెంటనే వచ్చిన ‘MS Dhoni' మాత్రం దిశా పటానీకి కెరీర్‌ను నిలబెట్టింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక ఝా అనే పాత్రను పోషించింది. ఇందులో ఆమె కనిపించేది కొద్ది సమయమే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

  వరుస సినిమాలు.. ఆల్బమ్స్.. ఫుల్ క్రేజ్

  వరుస సినిమాలు.. ఆల్బమ్స్.. ఫుల్ క్రేజ్

  ‘MS Dhoni' తర్వాత దిశా పటానీ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె వరుసగా జాకీ చాన్‌ చిత్రం ‘కుంగ్‌పూ యోగా', ‘వెల్‌కం టు న్యూయార్క్', ‘భాగీ 2', ‘భారత్', ‘మలాంగ్', ‘భాగీ 3' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటితో పాటు ‘బేఫికర్', ‘హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే'లో చేస్తోంది.

  కండల వీరుడితో ప్రేమాయణం.. రచ్చ రచ్చే

  కండల వీరుడితో ప్రేమాయణం.. రచ్చ రచ్చే

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది దిశా పటానీ. ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. ఈ మధ్య బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ బాగా హైలైట్ అవుతున్నారు.

  చంపేస్తామని బెదిరింపులు.. హాట్ టాపిక్‌గా

  చంపేస్తామని బెదిరింపులు.. హాట్ టాపిక్‌గా

  కొద్ది రోజుల క్రితం దిశా పటానీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేసిన విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆమెను చంపుతామని బెదిరింపు కాల్స్ చేశారు. అంతేకాదు, ఆమె నివసిస్తున్న ఏరియా పోలీస్ స్టేషన్‌కు సైతం కాల్ చేసి దిశాను ఎవరూ కాపాడలేంటూ వార్నింగ్ ఇచ్చారు. సిగ్నల్స్ ఆధారంగా ఇవి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

  ఎప్పుడూ అందులోనే.. సెషన్స్‌తో టచ్‌లో

  ఎప్పుడూ అందులోనే.. సెషన్స్‌తో టచ్‌లో

  వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇక, ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు నిర్వహిస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితమే ఫ్యాన్స్‌తో మరోసారి చాట్ నిర్వహించింది.

  Salaar 'Prabhas': Disha Patani And 2 more Bollywood Heroines in Movie | Filmibeat Telugu
  సీక్రెట్ పార్టును అలా చూపించిన హీరోయిన్

  సీక్రెట్ పార్టును అలా చూపించిన హీరోయిన్

  ఈ సెషన్‌లో ఓ నెటిజన్ ‘మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించేది ఏది' అని అడిగాడు. దీనికి తన కింద కంటిరెప్ప మీద ఉన్న పుట్టుమచ్చను చూపిస్తూ దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేసిన దిశ పటానీ.. ‘నా కంటి కింద ఓ పుట్టుమచ్చ ఉంది' అని చెప్పింది. తద్వారా అదే అందరి కంటే తనను ప్రత్యేకంగా చూపుతుందని తెలిపింది. ఇది చూసిన వారంతా షాకైపోతూ ఆమె పాత ఫొటోలను తిరగేస్తున్నారు.

  English summary
  Disha Patani is an Indian actress who works primarily in Hindi films. She began her acting career with the Telugu film Loafer (2015) opposite Varun Tej, and later made her Hindi debut in the sports biopic M.S. Dhoni: The Untold Story (2016).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X