శ్రీదేవిని చూసిన ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
2018లో ఇండియన్ సినీ రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద విషాదాల్లో ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి మరణం. ఆమె చివరగా రవి ఉద్యవర్ దర్శకత్వంలో వచ్చిన 'మామ్' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డు దక్కింది. అయితే అవార్డు అందుకోవడానికి ముందే ఆమె చనిపోయిన సంగతి తెలిసిందే.

ఇటీవల విడుదలైన 'జీరో' చిత్రంలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మరణించడానికి ముందే ఆ సీన్లు షూట్ చేయడంతో మరోసారి వెండితెరపై అతిలోక సుందరిని చూసే అవకాశం దక్కింది. 'జీరో'లో శ్రీదేవి కనిపించడంతో చాలా మంది ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి కనిపించే చివరి చిత్రం కూడా ఇదే.
'జీరో' చిత్రం చూసిన అనంతరం పలువురు అభిమానులు ట్విట్టర్ ద్వారా శ్రీదేవిని మిస్సవుతున్నట్లు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఇకపై ఆమెను తెరపై చూడలేమనే విషయాన్ని ఇప్పటికీ కొందరు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆనంద్ ఎల్ రాజ్ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మాతగా రెడ్ చిలీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన 'జీరో' చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీసు వద్ద జీరో చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











