twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే బరితెగించినట్లా? దీనికి సిగ్గులేదంటారు, ఆ నొప్పి అందరికీ తెలియాలి: గాయిత్రి గుప్తా

    |

    సోషల్‌గా ఒక అబ్బాయికి ఎంత ఫ్రీడం ఉంటుందో... అమ్మాయికి కూడా అంతే ఫ్రీడం ఉండాలి. అప్పుడే సమానత్వం వచ్చినట్లు అంటున్నారు తెలుగు నటి గాయిత్రి గుప్తాం. గాంధీజీ చెప్పినట్లు అమ్మాయి అర్దరాత్రి ఒంటరిగా రోడ్డు తిరిగినపుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అనడం వెనక ప్రధాన ఉద్దేశ్యం సోషల్ ఫ్రీడమ్ కావాలని చెప్పడమే అని తెలిపారు.

    తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో గాయిత్రి గుప్తా మాట్లాడుతూ... రాత్రి పూట ఒక మగాడు రేప్ భయం లేకుండా ఒంటరిగా తిరగ గలడు. కానీ మధ్యరాత్రి అదే ఆడది రోడ్డు మీద తిరిగితే బరితెగించింది అంటున్నారు. అలా అనడం సరికాదు. ఎవరో రేప్ చేస్తారనే భయం లేకుండా ఇది నా ఏరియా, ఇది నా ప్లేసు అని కాన్ఫిడెంటుగా నడిచినపుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్నారు.

    దీనికి సిగ్గు లేదు అంటారు..

    దీనికి సిగ్గు లేదు అంటారు..

    నా మనసులో ఏమనిపించిందో అది స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉన్నపుడే మనకు సోషల్ ఫ్రీడం ఉన్నట్లు. ఈ విషయంలో అందికీ హక్కు ఉంది. సెక్సువల్ హరాస్మెంట్ విషయం బయటకు మాట్లాడితే బాబోయ్ అని ఆశ్చర్య పోవడం, దీనికి సిగ్గులేదు అని ఎగతాళి చేయడం, నువ్వు అలా ఎలా మాట్లాడతావు? అని ప్రశ్నించడం లాంటి పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయని గాయిత్రి గుప్తా తెలిపారు.

    ఆ విషయాల్లో మార్పు రావాలి

    ఆ విషయాల్లో మార్పు రావాలి

    ఇంట్లో లైంగిక పరమైన విషయాలు చర్చించడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే మన మీద ఎలాంటి ముద్ర పడుతుందో? అందరూ ఏమనుకుంటారో? అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    పీరియడ్స్ నొప్పి అందరికీ తెలియాలి

    పీరియడ్స్ నొప్పి అందరికీ తెలియాలి

    పీరియడ్స్ గురించిన సమస్యలు ఎవరితో మాట్లాడవద్దు, అది సీక్రెట్... ఆ విషయాలు నీ వరకే ఉంచు అని కట్టడి చేసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. కానీ ఇలా చేయడం సరికాదు. నీకు పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పి గురించి బయటకు చెప్పినపుడే పరిష్కారం దొరుకుతుంది. నీలోనే దాచుకోవడం వల్ల నష్టాలే తప్ప ఎలాంటి లాభం లేదని గాయిత్రి అభిప్రాయ పడ్డారు.

    అప్పుడు ఫంక్షన్ చేస్తారు, కానీ పీరియడ్స్ గురించి మాట్లాడరు

    అప్పుడు ఫంక్షన్ చేస్తారు, కానీ పీరియడ్స్ గురించి మాట్లాడరు

    ఫస్ట్ టైమ్ పీరియడ్స్ రాగానే తమ కూతురు మెచ్యూర్ అయిందని ఫంక్షన్ చేస్తారు. కానీ పీరియడ్స్ గురించి మాత్రం మాట్లాడొద్దు అనే ఆంక్షలు పెడతారు. ఈ ఫంక్షన్ చేయడం వెనక ప్రధాన కారణం నా కూతురు పెళ్లికి సిద్ధమైంది అని డిక్లేర్ చేయడమే కదా. అలా చేసే వారు పీరియడ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి భయపడతారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

    ఎవరికీ చెప్పకుంటే మరిన్ని దారుణాలు

    ఎవరికీ చెప్పకుంటే మరిన్ని దారుణాలు

    ఒక రేపిస్ట్ వచ్చి రేప్ చేస్తే పరువు పోతుందనో, మరేదైనా భయంతోనో నేను మాట్లాడలేదనుకోండి... వాడిలో నాకు ఏమీ కాదు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మరో అమ్మాయిని కూడా ఇలాగే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలను బయట పెట్టడానికి, ఫిర్యాదు చేయడానికి వెనకాడకూడదని తెలిపారు.

    నేను మ్యారేజ్ మెటీరియల్ కాదు

    నేను మ్యారేజ్ మెటీరియల్ కాదు

    నేను మ్యారేజ్ మెటీరియల్ కాదు... పెళ్లి చేసుకోను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా అనేది సీక్రెట్. మ్యారేజ్ అనేది డెస్టినేషన్ కాదు. అది చాయిస్ మాత్రమే. అందరిలా పెళ్లి చేసుకుని రోటీన్ జీవితం గడపాలని నాకు లేదు. 50 మంది పిల్లలను అడాప్ట్ చేసుకుని పెంచాలని ఉంది. కొన్ని రేర్ కేసుల్లో తప్ప పెళ్లి చేసుకున్న ఎవరూ సంతోషంగా ఉండటం చూడలేదని గాయిత్రి గుప్తా తెలిపారు.

    English summary
    Gayatri Gupta Bold comments on women social freedom and periods. Gayatrhi Gupta is an Indian Telugu language actress and TV presenter. She is known for her progressive and liberal views. She is well known for her debates in Telugu News Channels about casting couch issue in Tollywood. She is known to be straight forward and frank.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X