Gunde Ninda Gudi Gantalu October 10th Episode: నాట్య మయూరి ప్రభావతి 2.0.. మరోసారి మీనాకు ఘోర అవమానం..

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ లో వంటింట్లో సరదాగా మాట్లాడుకుంటున్న శృతి, మీనాలు సరదాగా మాట్లాడుకుంటారు. "నువ్వు నిజంగా గ్రేట్ మీనా! ఇంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటావు" అని శృతి మెచ్చుకోగా, మీనా నవ్వుతూ "అంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా?" అని అడుగుతుంది. దానికి శృతి చిలిపిగా "నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా ముక్కు మీదే గుద్దుతా!" అంటుంది. ఈ మాటలు దొంగచాటుగా విన్న ప్రభావతి కోపంతో "నా మీద ఇంత కోపమా?" అని అనుకుంటుంది. వెంటనే వంటింట్లోకి వచ్చి మీనాపై నిప్పులు చెరుగుతుంది. "నాపై కారాలు మిరయాలు నురుతాయా? " అని ఆగ్రహిస్తుంది. మీనా కూల్‌గా "మజ్జిగ తాగుతారా అత్తయ్య?" అంటూ జోక్ చేస్తుంది. ఇంతలో మీనాకు ఫోన్ రావడంతో అర్జెంటుగా బయలుదేరుతుంది. "అరుణక్కకు సహాయం చేయడానికి వెళ్తున్నా" అని చెప్పి బాలు, ప్రభావతిని సమాచారం ఇస్తుంది.

అదే సమయంలో మరోవైపు రోహిణి, విద్యలు గుణ దగ్గరకు వెళ్లి తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్న దినేష్‌పై చర్య తీసుకోవాలని అడుగుతారు. గుణ మొదట నిరాకరించినా, వారు తన గతాన్ని గుర్తు చేస్తే అంగీకరిస్తాడు. దినేష్‌ను గుణ తీవ్రంగా కొడతాడు. ఆ చేజ్‌లో దినేష్ ఓ ముసలావిడను ఢీ కొడతాడు. అటుగా వచ్చిన బాలు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. రోహిణి సంతోషంగా గుణకు థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఇంట్లో ప్రభావతి మీనా మీద మళ్లీ మండిపడుతుంది. "నన్ను నీ పని మనిషిలా చూస్తావా?" అంటూ అవమానిస్తుంది. మీనా ప్రశాంతంగా స్పందిస్తూ "మా ఆయన చెప్తేనే ఆపుతా" అని చెబుతుంది. మాటల యుద్ధం పెరిగిపోతుంది. చివరికి ప్రభావతి "ఇక నేనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా!" అంటూ భరతనాట్యం డాన్స్ స్కూల్ ప్రారంభించాలని ప్రకటిస్తుంది. అందరూ షాక్ అవుతారు. మీనాక్షి స్థలం ఇవ్వడానికి నిరాకరించినా, మీనా, రోహిణి ఒప్పించడంతో చివరికి ఆమె అంగీకరిస్తుంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 10 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 529 October 10th 2025 here is full story
courtesy: Jiohotstar

భారత నాట్యం స్కూల్ కోసం మీనాక్షి ఇంటిని అడుగుతుంది ప్రభావతి. మొదట అంగీకరించకపోయిన.. 'పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న దానికి బదులు.. డాన్స్ స్కూల్ పెట్టుకోవడం చాలా గొప్ప' అని తన ఇంటిని డ్యాన్స్ స్కూల్ కు ఇవ్వడానికి మీనాక్షి ఒప్పుకుంటుంది. రోహిణి మాటలు వింటుంటే.. అతి త్వరలో నువ్వు గొప్ప డాన్సర్ అయ్యి.. లక్షల సంపాదిస్తావని అనిపిస్తుంది అంటుంది మీనాక్షి. దీంతో ప్రభావతి సంతోషానికి, ఆశలకు అవధులు లేకుండా పోతాయి. ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. దీంతో రోహిణి ఇక మా అత్తయ్య నా పార్లర్ జోలికి రాదని సంతోషంగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు.. ఇంట్లో వారందరినీ త్వరగా ఇంటికి రమ్మని, ప్రభావతి పిలుస్తుంది. దీంతో కంగారుగా అందరూ ఇంటికి చేరుకుంటారు. రవి అయితే ఏకంగా ఫుడ్ పార్సిల్ తీసుకొని వస్తాడు.

ముందుగా సత్యం ఇంటికి చేరుకుంటాడు. 'ఏంటమ్మా కాల్ చేసావ్.. త్వరగా రమ్మని పిలిచావు'అని మీనా అడుగుతాడు. 'ఆగండి మామయ్య.. మీరు అద్భుతాన్ని చూస్తారు. అత్తయ్య కొత్త రూపాన్ని మీరు చూడబోతున్నారు'అంటుంది మీనా. 'ఏంటి పాత పెళ్ళాన్ని కొత్తగా చూస్తానా.. అసలు మీ అత్తయ్య ఏం చేస్తుంది' అని గట్టిగా అడుగుతాడు సత్యం. 'అత్తయ్య రెడీ అవుతుంది' అని మీనా చెప్పగా.. 'ఇంటి నుండి వెళ్లిపోవడానికా? 'అని వెటకారంగా అంటాడు సత్యం. 'కాదు మామయ్య మన ఇంటి పేరు నిలబెట్టడానికి , అత్తయ్య భరతనాట్యం స్కూల్ స్టార్ట్ చేయబోతున్నారు' అంటూ సర్ప్రైజ్ విషయాన్ని చెప్పేస్తుంది. దీంతో ఒక్కసారిగా సత్యం కంగారు పడతాడు. 'ఏంటి ?'అని మళ్ళీ మీనా ను తిరిగి ప్రశ్నిస్తాడు..

'అవును.. మామయ్య మీరు విన్నది కరెక్టే.. అత్తయ్య నాట్య గురువు అయి.. తన శిష్యులకు నాట్యం నేర్పిస్తారు' అంటుంది మీనా. 'అగ్గిపెట్టలో ఆ ట్రంకు పెట్టే పట్టడమే కష్టం.. అలాంటిది స్కూలా? ' అని సత్యం కంగారుపడతాడు. 'కంగారు పడకండి మామయ్య కామాక్షి పిన్ని ఇంట్లో స్కూల్ పెడుతున్నారు' అని చెబుతోంది. 'అమ్మో... ముందే రంగారావు గుండె చాలా వీక్ ... వాడి ప్రాణాలతో చెలగాటం ఆడబోతుందా ?'అంటాడు సత్యం. 'అలా మాట్లాడకండి మామయ్య నేను ఒకసారి అత్తయ్య రోహిణి తో కలిసి డాన్స్ చేయడం చూశాను .. చాలా అద్భుతంగా చేశారు. అత్తయ్య లో మంచి డాన్సర్ ఉన్నారు. మీరు అద్భుతాన్ని చూస్తారు' అని ప్రభావతిపై మీనా ప్రశంసలు కురిపిస్తుంది.

'ఏమోనమ్మా అద్భుతాన్ని చూస్తానా.. ఆ భూతాన్ని చూస్తానా ..నాకు అర్థం కావడం లేదు.. ఈ వయసులో అలాంటి సాహసాలు మనకు అవసరమా? గుండె రాయి చేసుకోవాల్సిందే 'అని కాస్త కంగారు పడతాడు సత్యం. ఇంతలోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. 'ఏమైంది నాన్న.. అలా గుండె పట్టుకున్నారు ఏమైనా అయిందా హాస్పిటల్ కి వెళ్దామా?' అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు బాలు. 'అసలు నన్ను ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు.. నాన్నకు మీకు ఏమైంది' అని బాలు ప్రశ్నిస్తాడు. 'అదేం లేదు నాన్న మీ అమ్మ ఎంట్రీని బట్టి ఎటు వెళ్ళాలో డిసైడ్ చేద్దాము'అని సత్యం వెటకారంగా సమాధానం ఇస్తాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో బాలుకి అర్థం కాక.. అయోమయంలో పడతాడు. అసలు నన్ను ఎందుకు పిలిపించారని మరోసారి మీనా ను ప్రశ్నిస్తాడు బాలు. 'నేనేం కావాలని పిలవలేదు అత్తయ్యని మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయించింది'అని బదులిస్తుంది..

ఇంతలోనే రవి, శృతి కూడా ఇంటికి చేరుకుంటాడు. పైగా రవి ఫుడ్ పార్సెల్ కూడా తీసుకొని వస్తాడు. వచ్చి రాగానే 'ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు' అని రవి శృతి లు అడుగుతారు.. 'కాసేపు ఆగండి... మీరు ఆ భూతాన్ని చూస్తారు'అని సత్యం సేటేరికల్ గా మాట్లాడుతాడు. ఆ మాటలకు బాలు 'భూతమా' అని అడుగుతాడు. ఇంతలోనే ప్రభావతి గజ్జల సవ్వడి విని రవి, బాలు భయపడతారు. 'నానోయి.. పగటిపూట కూడా దెయ్యాలు తిరుగుతాయా ? 'అంటూ ఫన్నీగా అడుగుతారు. 'వాటికి రాత్రి పగలు తేడా ఏముంది రా .. ఇప్పుడు కావాలంటే అప్పుడు తిరుగుతాయి'అంటాడు సత్యం. నిజంగానే ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి నాన్న అని రవి అనగా.. 'ఆ శబ్దం దయ్యం వల్ల కాదురా.. మీ అమ్మ వల్ల'అంటాడు సత్యం. 'ఏంటి ప్రభావతి కాస్త దెయ్యవతిగా మారిందా' అంటూ బాలు సెటైర్ వేస్తాడు. ఇంతలోనే ప్రభావతి భరతనాట్యం డ్రెస్సు లో.. హాల్లోకి వస్తుంది. ప్రభావతి కొత్త రూపాన్ని చూసి అందరూ షాక్ అవుతారు.

'ఏంటి మమ్మీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నావా?' అని రవి అడుగుతాడు. మరోవైపు 'ఫ్యాషన్ కాంపిటీషనా ?' అని శృతి అడుగుతుంది. 'లేదు.. ఇది నా నిజ స్వరూపం.. ఇది నాలోని నాట్య కళాకారుని అసలు రూపం.. నాట్యం నా ప్రాణం .. నాట్యం నా ధ్యాస.. ఇదే ప్రభావతి 2.0' అంటూ వీరే లెవల్లో డైలాగ్ విసురుతుంది. దీంతో శృతి ఇంప్రెస్ అవుతుంది. ఈ కాస్ట్యూమ్స్ లో మీరు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి లాగా ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతుంది. దీంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది తన భరతనాట్య ప్రతిభను ఇంట్లో వారికి చూపిస్తుంది తనలోని నాట్య మయూరిని బయట పెడుతుంది. 'మీలో ఇంత కళ ఉందని ఎప్పుడో చెప్పలేదు' అని శృతి అనగా.. 'పెళ్లి పేరుతో నాలో ఉన్న నాట్య కళను తొక్కేశారు' అంటూ సత్యం పై విరుచుకుపడుతుంది ప్రభావతి.

'ఇక నుండి మీరే కాదు.. నా నాట్య కళను ఈ ప్రపంచం చూడబోతోంది'అని సంచలన ప్రకటన చేస్తోంది. దీంతో బాలు దీర్ఘ ఆలోచనలో పడతాడు. 'వీడేంటి అవాక్కయ్యాడా.. ప్రతిహాతుడయ్యాడా?' అంటూ ప్రభావతి పెద్ద పెద్ద డైలాగులుతుంది. 'నీ నిజ స్వరూపం చూసి వాడు షాక్ అయ్యాడు' అంటూ సత్యం. బాలుని తట్టి లేపుతాడు. ప్రభావతి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి సత్యం.. 'ఈ వయసులో ఈ అవస్థలు అవసరమా?' అని అడుగుతాడు.. 'వ్యవస్థ మారాలంటే.. అవస్థలు పడాలి. మీరు నాలో ఉన్న కొత్త రూపాన్ని చూస్తారు.. నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా'. అంటుంది ప్రభావతి. 'అత్తయ్య ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే.. భరతనాట్యం తో నలుగురికి పాఠాలు నేర్పడం బెటర్' అని మీనా ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది. 'నేను భరతనాట్యం స్కూల్ పెడితే.. నా బాధ ఉండదని అనుకుంటున్నావా? లేదా నిజంగానే సపోర్ట్ ఇస్తున్నావా' అని వెటకారంగా అడుగుతుంది ప్రభావతి. 'అదేం లేదు అత్తయ్య... నా ఫుల్ సపోర్ట్ నీకే' అని మీనా అంటోంది. ఆ తర్వాత శృతి రోహిణి కూడా మా ఫుల్ సపోర్ట్ నీకే అని ప్రభావతిని ఎంకరేజ్ చేస్తారు.

మరుసటి రోజు ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్లో ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శృతి వాళ్ళ అమ్మను పిలవాలని ప్రభావతి భావిస్తుంది. కానీ, కుదరక పోవడంతో సైలెంట్ అవుతుంది. 'ఇలాంటి విషయాలను ముందుగానే చూసుకోవాలి కదా.. తీరా సమయానికి వీళ్ళని పిలువలేదు.. వాళ్లను పిలువలేదు.. అంటే ఎలా? ' అని సత్యం కోపానికి వస్తాడు. వాళ్లు లేకపోతే ఏంటి.. అని శృతిని దీపం వెలిగించమని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత రోహిణి పిలిచి మరో ఒత్తిని వెలిగించమని చెబుతోంది. ఆ తర్వాత మీనాను పిలవమని మీనాక్షి అంటుంది. 'ఇక్కడ ఉన్నవి రెండే వత్తులే.. ఎక్కడ వెలిగించమంటావు 'అంటూ వెటకారంగా మాట్లాడుతుంది..
మీనా మూడు వత్తులు వేస్తే.. ఒక వత్తి మింగేసేవా? అని మీనాక్షి ముక్కుసూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో బాలుకి ఎక్కలేని ఆగ్రహం వస్తుంది. కావాలనే తన భార్యను అందరి ముందు అవమానించావు అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. స్కూల్ ఓపెనింగ్ నుండి వెళ్ళిపోదామని మీనాను పట్టుకొని బయలుదేరుతాడు. దీంతో సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలుని ఆగమంటాడు. ' వాళ్లు దీపాలు వెలిగించారు.. మీనా రిబ్బన్ కటింగ్ చేస్తుంది' అని సత్యం అంటాడు. మీనా చేతులతో దండలిస్తేనే గుడిలో మొదటి పూజ జరిగేది. మీ నా చేతు చాలా మంచిది అంటూ సత్యం రిబ్బన్ కటింగ్ చేయమంటాడు. కానీ ప్రభావతి అందుకు ఒప్పుకోదు. అవసరంలేదంటూ తెగేసి చెబుతోంది. ఇలా అందరి ముందు ప్రభావతి మరోసారి మీనా ను ఘోరంగా అవమానిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X