twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Invasive Carcinoma నా తల్లిని క్యాన్సర్ కబలించింది.. హంసానందినికి అరుదైన వ్యాధిపై సాయిధరమ్ ఎమోషనల్‌ కామెంట్

    |

    అందాల భామ.. 'మిర్చి' లాంటి సుందరి, తెలుగు తెరపై తన అభినయంతో ఆకట్టుకొన్న హంసా నందినికి జీవితంలో అతిపెద్ద సమస్య ఎదురైంది. తనను ప్రాణాంతక వ్యాధి ముట్టడించినా ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా మానసికంగా మహమ్మారిపై విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పిన విషయాలపై సినీ ప్రముఖులు హంసా నందినిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె తన సోషల్ మీడియా పోస్టులో ఏం వెల్లడించారంటే..

    జీవితం ముందు కఠిన పరీక్ష

    జీవితం ముందు కఠిన పరీక్ష

    జీవితం నాకు ఓ కఠిన పరీక్ష పెట్టింది. అయితే నాకు ఎలాంటి అన్యాయం ఏం చేయాలని చూసినా.. ఆ మహ్మమ్మారికి బాధితురాలిగా తలవంచను. క్యాన్సర్‌ను చూసి పారిపోకుండా నేను ఎదురిస్తాను. నాలో ధైర్యం, ప్రేమ ద్వారా ఆ ప్రాణాంతక వ్యాధిని జయిస్తాననే నమ్మకం నాలో ఉంది. నాలుగు నెలల క్రితం నా రొమ్ములో చిన్న కణితి ఏర్పడింది.

    అప్పుడే నా జీవితంలో ఏదో జరగకూడది జరగబోతుందని గ్రహించాను. మున్ముందు జీవితం సాఫీగా ఉండదని తెలుసుకొన్నాను. 18 ఏళ్ల క్రితం ఇదే వ్యాధితో నా తల్లి మరణించినప్పటి నుంచి చీకటి అనే విషాద నీడలో బతుకుతున్నాను అని హంసా నందిని పేర్కొన్నారు.

    అలాంటి రెండు ప్రాణాంతక వ్యాధులు కూడా

    అలాంటి రెండు ప్రాణాంతక వ్యాధులు కూడా

    నా రొమ్ములో కణితి ఏమిటనే విషయంతో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, ఇన్‌వాసివ్ కర్సినోమా (బ్రెస్ట్ క్యాన్సర్) అని చెప్పారు. బీఆర్‌సీఏ1 (వారసత్వంగా సంక్రమించే క్యాన్సర్) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. నా జీవితంలో మరో బ్ట్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 45 శాతం ఓవరియన్ క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్స్ ఉందనే విషయాన్ని వైద్యలు చెప్పారు. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి మూడోస్టేజ్‌లో ఉందని హెచ్చరించారు. ఆ తర్వాత మొత్తం 9 సార్లు కీమోథెరపీ చేయించారు. మరో ఏడు సార్లు కీమోథెరపీ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది అని హంసా నందిని తెలిపారు.

    మీకు నా ప్రామిసెస్ ఇవే..

    మీకు నా ప్రామిసెస్ ఇవే..

    ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నేను మీకు కొన్ని ప్రామిస్‌లు చేస్తున్నాను.
    1. నా జీవితాన్ని శాసించడానికి ప్రయత్నిస్తున్న క్యాన్సర్‌ను నా నుండి దూరంగా పారదోలుతాను. ఈ వ్యాధిని నా ముఖంపై చిరునవ్వుతో ఎదుర్కొంటాను. దానిపై విజయం కూడా సాధిస్తాను.
    2. మళ్లీ మరింత బలంగా, మంచిగా వెండితెరపైకి వస్తాను
    3. ఇలాంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడిన వారికి స్పూర్తి ఇచ్చేలా నా కథను అందరితో షేర్ చేసుకొంటాను.
    4. ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా నా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకొంటూ ముందుకు సాగుతాను అని హంసానందిని తన పోస్టులో తెలియజేశారు.

    నా పట్ల చూపిస్తున్న ప్రేమకు..

    నా పట్ల చూపిస్తున్న ప్రేమకు..

    గత కొద్ది నెలలుగా నేను కనిపించకపోవడంతో చాలామంది నాకు మెయిల్‌ చేస్తున్నారు. నాపట్ల చూపుతున్న ప్రేమకు, ఆప్యాయత, అనురాగానికి ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు చూపుతున్న ప్రేమతో నేను మరింత ధృడంగా మారుతున్నాను. ప్రస్తుతం నేను నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినీ కుటుంబం నా వెంట ఉందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి వాళ్ల అండతో క్యాన్సర్‌పై తిరుగులేని పోరాటం చేస్తున్నాను అని హంసా నందిని చెప్పింది.

    ఇన్‌వాసివ్ కార్సినోమా అంటే ఏమిటి?

    ఇన్‌వాసివ్ కార్సినోమా అంటే ఏమిటి?

    ఇన్‌వాసివ్ కార్సినోమానే వైద్య భాషలో ఇన్‌వాసివ్ లోబ్యులర్ కార్సినోమా అని కూడా అంటారు. రొమ్ము క్యాన్సర్‌లో మరో రకమైన వ్యాధి. రొమ్ములో పాలను ఉత్పత్తి చేసే కణాల్లో క్యాన్సర్‌ వ్యాధి మొదలు అవుతుంది. ఆ కణాల్లో నుంచి క్యాన్సర్ కణాలు బయటకు వచ్చి నరాలు, నాడుల ద్వారా దేహంలోని ఇతర అవయవాలకు పాకుతుంది.

    బ్రెస్ట్ క్యాన్సర్ సోకినప్పుడు లక్షణాలు ఇవే..

    బ్రెస్ట్ క్యాన్సర్ సోకినప్పుడు లక్షణాలు ఇవే..

    ఇన్‌వాసివ్ కార్సినోమా వ్యాధి సోకినప్పుడు పెద్దగా లక్షణాలు కనిపించవు. క్యాన్సర్ కణాలు పెరిగుతున్నప్పుడు ఛాతి వాపెక్కడం జరుగుతుంది. రొమ్ముపై చర్మం కలర్ మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకపోతే ప్రాణాంతకంగా మారుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

    సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

    సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

    తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించగానే.. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. లావణ్య త్రిపాఠి, నిర్మాత ఎస్‌కేఎన్, దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు ఆమెకు అండగా నిలిచారు. సాయిధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేస్తూ.. మేడమ్ పోస్టులో మీరు చూపిన స్పూర్తి అభినందనీయం. మీకు మరింత మనోబలం, పాజిటివిటి వస్తుంది. మీరు త్వరగా కోలుకొని మీ కథను స్పూర్తిదాయకంగా అందరికి వెల్లడించాలి అని ఎమోషనల్‌గా స్పందించారు.

    English summary
    Hamsa Nandini instagram post viral after she diagnosed with Grade III Invasive Carcinoma Breast Cancer. She post that, 4 months ago, I felt a tiny lump in my breast. That very moment I knew that my life was never going to be the same. 18 years ago I had lost my mom to a dreadful disease and I had since lived under its dark shadow. I was scared.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X