Don't Miss!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సినిమాలు లేక హన్సిక బుగ్గల బిజినెస్.. నెగిటివ్ వార్తలకు కౌంటర్ ఇచ్చిన దేశముదురు బ్యూటీ
దేశముదురు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన వైట్ బ్యూటీ హన్సిక మోత్వాని ప్రస్తుతం కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ ఆమెను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ లో చాలా వరకు తెలుగు అభిమానులే ఉన్నారు. అందుకే ఆమెకు సంబంధించిన వార్తలు ఇక్కడ కూడా బాగానే వైరల్ అవుతుంటాయి.

అవకాశాలు లేక కొత్త బిజినెస్
ఇటీవల హన్సిక సినిమా అవకాశాలు లేకపోవడంతో ఒక వ్యాపారం మొదలుపెట్టిందని వార్తలు గట్టిగానే వచ్చాయి. బెలూన్స్ బిజినెస్ స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఈవెంట్స్ జరిగితే తన టీమ్ తోనే ఈవెంట్స్ కి డెకరేషన్స్ కూడా చేస్తోందని కథనాలు వెలువడ్డాయి. గత ఇంటర్వ్యూలలో హన్సిక తనకు ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టమని ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లలో చాలా బాగా వర్క్ చేస్తానని కూడా చెప్పింది.

కనుక్కొని మరి కౌంటర్ ఇచ్చింది
హన్సిక చెప్పిన విషయాన్ని బట్టి.. సినిమా అవకాశాలు లేక కెరీర్ కి ఎండ్ కార్డ్ పెట్టి బెలూన్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు రూమర్స్ రావడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలుసుకున్న హన్సిక మొదట ఈ రూమర్ ని ఎవరు స్టార్ట్ చేశారు అనే కోణంలో ఆరా తీయగా.. ఒక ప్రముఖ వెబ్ సైట్ అని కనుగొంది.

ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేశారు..
ఇక ఆ వెబ్ సైట్ కి సంబంధించిన ట్విట్టర్ ఎకౌంట్ ని ట్యాగ్ చేస్తూ.. తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజంగా ఈ వార్త నన్ను క్రాక్ కి గురి చేసింది. థ్యాంక్స్.. నేను ఎలాంటి వ్యాపారం చేస్తాను అనే విషయంలో మీ ఆలోచనలను పదును పెడుతున్నారు. నిజంగా నేను ఊహించని దానిపై మీరు ఎప్పుడు దృష్టి పెట్టారు. ఆ పని ఎప్పుడు స్టార్ట్ చేశారు. అది నన్ను ఆశ్చర్యనికి గురి చేస్తోంది అంటూ హన్సిక అపహాస్యంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
Recommended Video

విషయం ముదురుతోంది అంటే..
సాధారణంగా హన్సిక రూమర్స్ పై పెద్దగా స్పందించదు. విషయం ముదురుతోంది అంటే మాత్రం ఈజీగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ మహా, పాట్నర్ అనే రెండు సినిమాలు చేస్తోంది. మరో రెండు సినిమాలకు కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.