Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎన్నాళ్లకెన్నాళ్లకు... హాట్ బికినితో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన హన్సిక
దేశముదురు సినిమాతో పదహారేళ్ళ వయసులోనే గ్లామరస్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. బాంబేకి చెందిన హన్సిక అతి తక్కువ కాలంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఎంత హాట్ గా ఉన్న కూడా ఎక్కువగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకోలేకపోయింది. అలాగే ఎప్పటికప్పుడు మిగతా హీరోయిన్స్ కూడా పోటీని ఇవ్వడంతో కొన్ని అవకాశాలు కూడా చేతులరా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏదో ఒక సినిమాతో తన కెరీర్ ను ఒక ట్రాక్ లో కొనసాగిస్తోంది. వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే వెళుతుంది. ఇక అప్పుడప్పుడు హాట్ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా పుట్టినరోజు సందర్భంగా అమ్మడు హాలిడేస్ కి వెళ్ళింది. స్నేహితులతో కలిసి నిరంతరం పార్టీలు చేసుకుంటూ అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో కూడా షాక్ ఇస్తోంది.

షకలక బూమ్ బూమ్
హన్సికా మోత్వాని ముంబై సింధీ ఫ్యామిలీ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక ఈ బ్యూటీ చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ప్రముఖ టెలివిజన్ సిరీస్ ల తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. మొదట తన కెరీర్ ను 'షకలక బూమ్ బూమ్' టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనంతరం కొన్ని హిందీ హిందీ సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

పదహారేళ్ళ వయసులోనే
స్కూల్ దశలోనే పదహారేళ్ళ వయసులోనే పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ వెండితెరకు మెయిన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి అప్పట్లో హన్సికకు పదహారేళ్ళ వయసు అంటే ఎవరు నమ్మలేదు. ఇక ఆ తరువాత ఈ బ్యూటీకి రెండేళ్లలోనే మంచి గుర్తింపు దక్కింది.

తెలుగులో తక్కువ అవకశాలు
తమిళ్ తెలుగు మలయాళం అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లోనూ నటించింది. తెలుగులో కంత్రి, మస్కా, కందిరీగ వంటి సినిమాలతో అయితే మంచి గుర్తింపు అందుకుంది. ఇక తమిళంలో సూర్య, విజయ్ వంటి అగ్ర హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం అగ్రహీరోలతో నే కాకుండా యువ హీరోలతో కూడా నటించిన ఈ బ్యూటీకి గత ఏడాది వరకు కూడా మంచి అవకాశాలు దక్కాయి. కానీ తెలుగు సినిమాతోనే మొదట ఎంట్రీ ఇచ్చినప్పటికి ఇక్కడే ఆమెకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఇక చివరగా తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో నటించింది. అనంతరం పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు.

స్నేహితులతో పార్టీలు
ఇటీవల తన 30వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి స్పెషల్ గా పార్టీ చేసుకుంది. హన్సికకు తన స్నేహితులు అంటే ఎంతో ఇష్టం. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కూడా వారితో ప్రత్యేకంగా టైమ్ స్పెండ్ చేస్తుంది. స్కూల్ నుంచి కూడా స్నేహితులను ఏ మాత్రం దూరం పెట్టలేదు. స్టార్ హోదా ఎంత వచ్చినా కూడా వారితో అదే తరహా బాండింగ్ ను మెయింటైన్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పుట్టినరోజును కూడా వారి స్నేహితులు ప్రత్యేకంగా నిర్వహించారు. ఆమెకు తెలియకుండా ప్రత్యేకంగా సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు.

హాట్ బికినీలో..
కొంతమంది స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ హాట్ బికినీతో షాక్ ఇచ్చింది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఏమిటి ఈ స్థాయిలో అయితే స్టిల్స్ ఇచ్చింది లేదు. ఇక హన్సిక కొన్ని నెలల క్రితం కాస్త బొద్దుగా యాపిల్ బ్యూటీలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సైజ్ జీరోను మెయింటైన్ చేస్తోంది.ఎక్కువ కాలం ఒకే తరహాలో కనిపిస్తుండడంతో జనాలకు బోర్ కొట్టేసిందని అనుకుందో ఏమో గాని ఇప్పుడు మాత్రం కాస్త కొత్తగా కనిపించాలని పూర్తిగా సన్నగా మారిపోయింది. మూడు పదుల వయసు దాటినా వీలైనంతవరకూ తనకు సూటయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెకండ్ హీరోయిన్ గా అయినాసరే ఏ మాత్రం నో చెప్పడం లేదు.
Recommended Video

తొందర పడకుండా
ఎక్కువగా తొందర పడకుండా మంచి కథలను ఎంపిక చేసుకుంటోంది. కానీ అవేవి కూడా హన్సికకు అంతగా కలిసి రావడం లేదు. ఇక ప్రస్తుతం అయితే హన్సిక మోత్వాని చేతులో పెద్ద సినిమాలు కూడా లేవు. తమిళంలో మహా అనే ఒక డిఫరెంట్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఆ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దాదాపు మరో సినిమా సినిమా షూటింగ్ కూడా అయిపోవచ్చింది. ఇక తెలుగులో మై నేమ్ ఇస్ శృతి, 105 మినిట్స్ అనే సినిమాలతో బిజీగా ఉంది. మరి ఆ సినిమాలతో ఈ బ్యూటీ ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటుందో చూడాలి. అలాగే తెలుగు వెబ్ సిరీస్ లో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.