Hansika Motwani: భర్తకు హన్సిక విడాకులు? వినాయకుడి సాక్షిగా కన్ఫర్మ్ చేసిన హీరోయిన్

ప్రస్తుతం ఇండియాలో సెలబ్రెటీల విడాకులు హాట్ టాపిక్ మారుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నయనతార - విఘ్నేష్ శివన్, సంగీత - క్రిష్, గోవింద - సునీత అహుజాలు విడాకులు తీసుకోబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దశలో స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ విడాకులు తీసుకొబోతున్నట్లుగా గత కొంతకాలంగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అలాంటిదేమీ లేదని హన్సిక భర్త సొయైల్ కతూరియా చెబుతన్నప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్సిక వీటికి తెరదించారు.

చిన్న వయసులోనే హీరోయిన్‌గా
చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురుతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. కందిరీగ, బిల్లా, మస్కా, కంత్రీ, దేనికైనా రెడీ తదితర చిత్రాలలో నటించింది. టాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టి.. అక్కడా అలరించారు హన్సిక మోత్వానీ. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన హన్సిక ఆయనతో పెళ్లి వరకు వెళ్లింది. కానీ చివరి నిమిషంలో ఈ జంట విడిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు.

Hansika Motwani-Sohael Khaturiya Divorce Actress did not apply sindoor or wear mangalsutra for ganesh chaturthi

సొహైల్‌తో పెళ్లి
అందాన్ని, శారీరాన్ని గాలికొదిలేయడంతో హన్సిక విపరీతంగా బరువు పెరిగిపోయారు. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎంతో కష్టపడి బరువు తగ్గినప్పటికీ ఫేస్‌లో మునుపటి ఛార్మింగ్ కనిపించకపోవడంతో హన్సికను పట్టించుకునే వారే కరువయ్యారు. ఒకటి రెండు సినిమాలలో నటించినా అవి పెద్దగా హిట్ కాకపోవడంతో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయింది హన్సిక. కొన్ని హిందీ, తెలుగు ఛానెళ్లలో హన్సిక.. జడ్జిగా కనిపించి షాకిచ్చారు. ఈ దశలో తన చిన్ననాటి మిత్రుడు సొహైల్ కతూరియాతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనను పెళ్లాడింది. అయితే హన్సిక కంటే ముందే సొహైల్‌కు పెళ్లయ్యింది.

భర్త ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక
కొంతకాలం పాటు ఈ జంట అన్యోన్యంగా ఉన్నప్పటికీ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు వచ్చాయి. సొహైల్‌‌కు దూరంగా తల్లి దగ్గరికి వచ్చేసింది హన్సిక. దీంతో హన్సిక విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. అయితే వీటిని హన్సిక భర్త సొహైల్ మాత్రం కొట్టిపారేశాడు. కానీ తన పెళ్లి, సొహైల్‌తో కలిసున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి హన్సిక డిలీట్ చేశారు. దీంతో సొహైల్ - హన్సికల విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

వినాయక చవితితో హింట్
తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హన్సిక - సొహైల్‌ల విడాకుల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. గణేష్ చతుర్ది పర్వదినాన్ని సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. హన్సిక కూడా వినాయకుడిని స్వయంగా తన ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం తన ఇంటిని అందంగా డెకరేట్ చేసి పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి హాట్ టాపిక్‌గా మారాయి.

భర్త, మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా పండుగ జరుపుకోవడంతో పాటు మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా దర్శనమిచ్చింది. హిందూ స్త్రీలు, సెలబ్రెటీలు అయినప్పటికీ ప్రత్యేక పర్వదినాల్లో ఖచ్చితంగా మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా ఉండరు. అలాంటిది హన్సిక ఇలా కనిపించడంతో తను భర్త నుంచి దూరమైనట్లుగా, విడాకులపై హింట్ ఇచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై హన్సిక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X