Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
క్రేజీ స్క్రిప్ట్ విన్నాను.. హెబ్బా పటేల్ పోస్ట్ వైరల్
ప్రస్తుతం హెబ్బా పటేల్ కొత్త కథలకు మాత్రమే ఓకే చెబుతోంది. మొదటి నుంచి కూడా హెబ్బా పటేల్ ఎంచుకునే స్క్రిప్ట్‌లో కొత్తదనం ఉండేలానే చూసుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలను హెబ్బా పటేల్ ఎంచుకుంటుంది. అయితే ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో పల్లెటూరి పాత్రలో హెబ్బా పటేల్ కనిపించబోతోంది.
అలా పల్లెటూరి భామగా హెబ్బా పటేల్ పోస్టర్లు, లుక్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక చివరగా ఓరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలోనూ హెబ్బా పటేల్ కనిపించింది. మాస్ సాంగ్‌కు రామ్‌తో కలిసి స్టెప్పులు వేసింది. ఆ పాట, అందులో వేసిన స్టెప్పులు హెబ్బా పటేల్‌ను మరింత దగ్గర చేశాయి.

అయితే తాజాగా హెబ్బా పటేల్ ఓ క్రేజీ స్క్రిప్ట్‌ను చదివిందట. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ హెబ్బా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్టు కనిపిస్తోంది. తెలిసిన వాళ్లు అనే డిఫరెంట్ టైటిల్‌తో రాబోతోంది. సిరంజ్ సినిమా నిర్మిస్తోండగా.. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారని చెప్పుకొచ్చింది.