Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నోయల్‌తో విడాకులు.. ఆ విషయం ఎవరికి నచ్చలేదు.. మొదటిసారి స్పందించిన మాజీ భార్య ఎస్తేరా!
నోయల్ సీన్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే అతను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భార్య ఎస్తేరా నుంచి విడాకులు తీసుకోవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అనేక రకాల రూమర్స్ కూడా వచ్చాయి. ఇక మొదటిసారి ఆ విషయంపై ఎస్తేరా తనదైన శైలిలో సున్నితంగానే వివరణ ఇచ్చింది.

ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..
ఎస్తేరా నోరాన్హా కూడా మొదట సింగర్ గానే తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అయితే ఆ తరువాత నటనపై కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట ఫ్యాషన్ వరల్డ్ లో తన గ్లామర్ తో అందరిని ఎట్రాక్ట్ చేసింది. అనంతరం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన 1000అబద్ధాలు అనే సినిమా ద్వారా అమ్మడు హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.

రాజమౌళి ఫ్యామిలీతో సన్నిహితంగా..
కొన్నాళ్ళు సింగర్ నోయల్ తో డేటింగ్ చేసిన ఎస్తేరా అతన్ని 2019లో క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుకకు ప్రముఖ సింగర్స్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీ సభ్యులు కూడా వచ్చారు. కీరవాణి మ్యూజిక్ చేసిన సినిమాలకు నోయల్ చాలా సార్లు ర్యాపర్ గా కూడా పాటలు పాడారు. అందుకే వారి ఫ్యామిలీ చాలా క్లోజ్.

నోయల్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు..
ఇక ఏడాది గడవకముందే నోయల్, ఎస్తేరా విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. నోయల్ కూడా ఆ రూమర్స్ పై స్పందించి అబద్దాలని నమ్మకండని ఇద్దరం హ్యాపీగానే విడిపోతున్నట్లు చెప్పాడు. పరిష్కరించని సమస్య వల్లనే ఇద్దరు విడుకులు తీసుకున్నట్లు ఆ తరువాత సన్నిహితుల ద్వారా మ్యాటర్ లీక్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

మొదటిసారి స్పందించిన ఎస్తేరా
ఇక తాజాగా ఎస్తేరా ఒక ఇంటర్వ్యూలో నోయల్ పేరు ఎత్తకుండానే వివరణ ఇచ్చింది. ఎస్తేరా మాట్లాడుతూ.. నేను భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించాను. రేపటి రేపటి గురించి కూడా పెద్దగా పట్టించుకోను. ప్రస్తుతం లైఫ్ ఎలా ఉంది. ముందున్న విషయాలను ఎలా ఫేస్ చేయలని మాత్రమే ఆలోచిస్తాను. నేను తప్పు చేయలేదు. ఎవరికి నష్టం జరగాలని కూడా కోరుకోలేదని వివరించింది.

ఆ విషయం నచ్చలేదు
అదే విధంగా నేను నా జీవితంలో సీరియస్ గా ఉండను అని చాలా మంది కామెంట్ చేశారు. సింగర్ గా, క్లాసికల్ డ్యాన్సర్ గా కూడా స్టేజ్ షోలు చేసినప్పుడు తన కెరీర్ పై సిరీయస్ గా లేదని కొందరికి నచ్చలేదు. ఆమె ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించదని కూడా అనేవారు. చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ నాకు నచ్చినట్లుగానే పెంచారని ఎస్తేరా తెలిపింది.

తలరాత ఎలా ఉంటే.. అలా ఉంటుంది
ఇక డెస్టిని అనేది కూడా ఉంటుందని అంటూ.. మన తలరాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. అది జరగాలని లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా జరగదు. ఒకవేళ జరగదేమో అనుకున్నా మన లైఫ్ లో జరగాలని ఉంటే ఏదైనా జరుగుతుంది. నేను హ్యాపీగా ఉన్నాను అవతలి వ్యక్తి కూడా సంతోషంగానే ఉన్నట్లు ఎస్తేరా సింపుల్ గా క్లారిటీ ఇచ్చేసింది.