Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
విచ్చలవిడిగా లవ్ లెటర్స్.. ఓ లెటర్‌లో అది చూడగానే భయపడిపోయా: హీరోయిన్
''కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా'' అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది హీరోయిన్ రేఖ. 'ఆనందం' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఆ తర్వాతి కాలంలో వెండితెరకు దూరమైన ఆమె తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూ రూపంలో ప్రేక్షకులను పలకరించింది.
ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కన్నడలో తాను 'చిత్ర' సినిమా చేశానని, హీరోయిన్‌గా తనకదే మొదటి సినిమా అని చెప్పింది రేఖ. అందులో తన గ్లామర్ చూసి ప్రేక్షకులు ఫిదా కావడం తనను చాలా సంతోష పెట్టిందని చెప్పింది. తాను తెరపై కనిపించగానే కొంతమంది అభిమానులు చిల్లర డబ్బులు తెరపైకి చల్లేవారని తెలిసి చాలా ఆనంద పడ్డానని రేఖ చెప్పుకొచ్చింది.

ఆ సినిమా తర్వాత అభిమానుల నుంచి లవ్ లెటర్స్ వచ్చేవని, ఓ అభిమాని ఏకంగా రక్తంతో లవ్ లెటర్ రాయడంతో చాలా భయపడ్డానని చెప్పింది రేఖ. ఆ సినిమా సక్సెస్, అలా వచ్చిన గుర్తింపును తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది హీరోయిన్ రేఖ. అలాగే కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్న రేఖ.. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి అంటూ సరదాగా స్పందించింది.