అనుష్క శెట్టికి ఆరోగ్య సమస్యలా? అందుకే ఘాటీకి దూరంగా!
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి పవర్ పాత్రతోపాటు విభిన్న కథాంశంతో రూపొందిన ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్తమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో క్రిష్, రాజీవ్ రెడ్డి, చైతన్య రావు, విక్రమ్ ప్రభు, జగపతి బాబు ప్రమోషన్స్ కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే కథానాయిక అనుష్క మాత్రం ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల మీడియాతో టెలిఫోన్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు విషయాలను పంచుకొన్నారు. ఆ విషయాలు, ఆమె కెరీర్, ఆరోగ్య విషయాల గురించిన వివరాల్లోకి వెళితే..
బాహుబలి తర్వాత అనుష్క శెట్టి పాన్ ఇండియా స్థాయి హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. భాగమతి, సైరా నర్సింహరెడ్డి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి మాఫియా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రిష్ సృష్టించిన వేదం చిత్రంలోని సరోజ పాత్ర తర్వాత శీలావతి పాత్ర తన మనసుకు నచ్చిన పాత్ర అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ.. క్రిష్ ఎంచుకొనే కథలు.. వాటిని చెప్పే తీరు తనకు ఎంతో ఇష్టం. స్టోరీలను నరేట్ చేసే విధానం గొప్పగా ఉంటుంది. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సమస్య అందర్నీ ఆలోచింపజేస్తుంది. ఈ సినిమాలోని పాత్ర తనకు మనసుకు దగ్గరగా ఉంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందనే అభిప్రాయం నాకు కలిగింది అని అనుష్క శెట్టి తెలిపారు.
ఘాటీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం వెనుక వేరే కారణాలు ఏమీ లేవు. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే అందరూ ఆందోళన పడేంతగా సమస్యలు లేవు. కొన్ని కారణాల వల్ల మీడియాకు, ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నాను. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ల కారణంగా ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ విషయాలు నిర్మాత, దర్శకులకు ముందే చెప్పాను. వారు కూడా అందుకు ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు. ఇక ముందు ప్రమోషన్స్‌లో తప్పకుండా పాల్గొంటాను అని అన్నారు.
బాహుబలి మూవీ రీ రిలీజ్ సందర్బంగా జరిగిన ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. మా టిమ్ మెంబర్స్ అంతా కలుసుకొన్నాం. ఈ సినిమా రిలీజ్ గురించి ఎదురు చూస్తున్నాను. బాహుబలి రీ రిలీజ్ సమయంలో మీడియాతో భాగమవుతాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను. సినిమా పరిశ్రమ ప్రముఖులతో కలుస్తూనే ఉన్నాను. ఇటీవల నేను నటించిన తొలి సినిమా సూపర్ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది అని చెప్పారు.
అనుష్క శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. ఘాటీ చిత్రం తర్వాత ఆమె మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. కథానార్: ది వైల్డ్ సోర్సెరర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ హీరో సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్కతోపాటు జయసూర్య, ప్రబుదేవా, వినీత్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం, ప్రముఖ నిర్మాత గోకుళం గోపాలన్ మూవీని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











