సీక్రెట్‌గా కాజోల్ సొదరి పెళ్లి.. అసలు విషయం బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలో సినీ తారల పెళ్లిళ్ల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే బాలీవుడ్‌లో కత్రినా కైఫ్ పెళ్లి చేసుకొని ఓ ఇంటిదానిగా మారిపోయింది. ఇంకా ఆ పెళ్లి సందడి ముగియక ముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవగన్ చెల్లెలి పెళ్లి వార్త మీడియాలో జోరుగా షికారు చేసింది. సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నదనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ విషయంలోకి వెళ్తే..

గోవాలో రచ్చ చేస్తూ..

గోవాలో రచ్చ చేస్తూ..

కాజోల్ దేవగన్ చెల్లెలు తనీషా ముఖర్జీ బాలీవుడ్‌లోకి ప్రవేశించి ఒకట్రెండు సినిమాలు చేసింది. కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నట్టు కనిపించలేదు. అయితే తాజాగా గోవాలో ఈ బ్యూటీ సందడి చేసింది. గోవాలో హాట్ హాట్‌గా కనిపించిన నేపథ్యంలో ఆమె కాళ్లకు మెట్టెలు కనిపించడంతో అంతా పెళ్లి చేసుకొన్నదనే నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొన్నదనే విషయం హిందీ చలన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

కాలి మెట్టెలు తెచ్చిన తంటా

కాలి మెట్టెలు తెచ్చిన తంటా

తన కాలి మెట్టెల గురించి వివరణ ఇస్తూ.. మెట్టెలు మహిళలకు చాలా ముఖ్యమైనవి. వాటిని ధరించడం నాకు చాలా ఇష్టం. అలా సరదాగా ఫ్యాషన్ కోసం ధరించాను. కానీ ఇంత రచ్చ చేస్తుందని ఊహించలేదు. ఇలాంటి వార్తలు నాకు చాలా ఆలస్యంగా తెలిసాయి. నేను మొబైల్ నెట్ వర్క్ లేని ప్రదేశంలో విడిది చేయడం వల్ల ఫోన్‌ కాల్స్ అందుబాటులో లేకుండా ఉన్నాను అని తనీషా ముఖర్జి తెలిపారు.

పెళ్లి వార్తలో వాస్తవం లేదు

పెళ్లి వార్తలో వాస్తవం లేదు

తనీషా ముఖర్జీ గోవాలో తన జోష్‌లో తాను ఉంటే.. మీడియాలో ఆమె పెళ్లి వార్తలు ట్రెండ్ అయ్యాయి. అయితే మొబైల్ నెట్ వర్క్‌కు దూరంగా ఉండటంతో మీడియా వార్తలు ఆమె దృష్టికి రాలేదు. కానీ మీడియాలో వస్తున్న వార్తలు ఆమె చెవిన పడటంతో ఇటీవల జాతీయ మీడియాతో వివరించారు. పెళ్లి వార్తలో వాస్తవం లేదు. అదంతా రూమర్లే. ఏదైనా అలాంటి విషయం ఉంటే మీడియాకు చెప్పకుండా చేసుకొంటానా? అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

సీక్రెట్‌గా పెళ్లి చేసుకొను..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకొను..

పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైనది. అందరూ దాని గురించి ఆలోచించడంలో తప్పేమి లేదు. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆ డ్రీమ్ ఎప్పటికప్పుడు మారిపోతున్నది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతు వస్తున్నది. ఇప్పుడే అబ్బాయిల హృదయాలను బ్రేక్ చేసే ప్రసక్తి లేదు.

పెళ్లి కుదిరితే తప్పకుండా మీడియాకు వెల్లడిస్తాను. ప్రపంచానికి చెప్పి పెళ్లి చేసుకొంటాను. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోను. ఇంకా నేను సింగిల్ గానే ఉన్నాను. నాకు ఎలాంటి అఫైర్లు లేవు అని తనీషా ముఖర్జీ అన్నారు.

హిందీ బిగ్‌బాస్‌తో పాపులారిటీ

హిందీ బిగ్‌బాస్‌తో పాపులారిటీ

కాజోల్ సోదరిగా పరిచయమైన తనీషా ముఖర్జీ హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా మరింత పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఈ యువ హీరోయిన్ కోడ్ నేమ్ అబ్దుల్ అనే చిత్రంలో నటించింది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2020లో రిలీజైంది. కోవిడ్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నది. పలు ప్రాజెక్టులు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X