For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas పై మనసుపడ్డ పాయల్ రాజ్‌పుత్.. ఆఫర్ కోసం అలాంటి ఓవరాక్షన్!

  |

  పాయల్ రాజ్‌పుత్ పేరే ఒక సంచలనం. ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాల ఆరబోతలోని హద్దులన్నీ చెరిపేసింది. తెలుగు స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని విధంగా పాయల్ రాజ్‌పుత్ అందాల ప్రదర్శన చేసింది. మొదటి సినిమాతోనే తెలుగులో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. అలా పాయల్‌కు ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది.దాంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో వచ్చిన చిత్రమల్లా చేసుకుంటూ వెళ్లింది. కానీ సక్సెస్ రేట్ మాత్రం శూన్యంగా మిగిలింది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ రాబోతోంది.

  అలా ఎంట్రీ..

  అలా ఎంట్రీ..

  పాయల్ రాజ్‌పుత్ పంజాబీ ముద్దుగుమ్మ. పంజాబీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసింది. హిందీలో సీరియల్స్ చేసింది. అలా అక్కడ పరిచయమైన ఈ బ్యూటీ తెలుగు వారికి ఆర్ఎక్స్ 100 సినిమాతో దగ్గరైంది. ఈ సినిమా పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌ను ఒక్కసారిగా పీక్స్‌లోకి తీసుకెళ్లింది. పాయల్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

  కుప్పలు తెప్పలుగా..

  కుప్పలు తెప్పలుగా..

  పాయల్‌కు కుప్పలుతెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కుర్ర హీరోలంతా కూడా పాయల్ హీరోయిన్‌గా కావాలంటూ కూర్చున్నారు. అయితే పాయల్ నటించిన చిత్రాలేవీ ఆ తరువాత అంతగా ఆడలేదు. లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఆర్‌డీఎక్స్ లవ్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆమె చేతిలో పడ్డ ఒకే ఒక పెద్ద చిత్రం వెంకీమామ. ఆ సినిమా హిట్ అయినా పాయల్ లుక్స్ మీద దారుణమైన ట్రోలింగ్ వచ్చింది.

  నటిగా గుర్తింపు..

  నటిగా గుర్తింపు..

  అందాల ఆరబోతలోనే కాదు.. పాయల్‌కు మంచి నటిగానూ గుర్తింపు ఉంది. ఓటీటీలో వచ్చిన అనగనగా ఓ అతిథి అనే చిత్రం బాగానే ఆకట్టుకుంది. అందులో పాయల్ నటన అందరినీ మెప్పించింది. కరోనా సమయంలో నెట్టింట్లో పాయల్ తెగ సందడి చేసింది. ఆమె అందాల ప్రదర్శన, దాని మీద ట్రోలింగ్ ఇలా అన్నీ కూడా హాట్ టాపిక్‌గా మారాయి.

  ప్రమోషన్స్‌లో బిజీగా..

  ప్రమోషన్స్‌లో బిజీగా..


  ప్రస్తుతం పాయల్ తీస్ మార్ ఖాన్ అనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తానేమీ స్టార్ కిడ్‌ను కాదని, తాను ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చానని, దానికి కారణం ఆడియెన్స్ అభిమానమని, మీరు చూపించే ప్రేమతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను అంటూ ఇలా పాయల్ ఎమోషనల్ అయింది. మూడేళ్ల తరువాత థియేటర్లో కనిపించబోతోన్నానంటూ తీస్ మార్ ఖాన్ గురించి పాయల్ చెప్పింది.

  నెట్టింట్లో అలా..

  నెట్టింట్లో అలా..


  ఇక తాజాగా పాయల్ నెట్టింట్లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ నెటిజన్ ఇలా అడిగాడు. ప్రభాస్‌తో మీరు ఎప్పుడు సినిమా చేస్తారు? అని నెటిజన్ అడిగితే.. పాయల్ ఇలా సమాధానం ఇచ్చింది. నేను కూడా ఆయనతో పని చేయాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాను.. ప్రభాస్ గారు.. ఇక మీరే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. ఈ ప్రశ్న విని వినీ నేను విసిగెత్తిపోయాను అంటూ ప్రభాస్‌ను ట్యాగ్ చేసింది.

  ఇక ఇది కాస్త ఓవర్‌గానే అనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు. నువ్ ట్యాగ్ చేసినంత మాత్రానా.. ప్రభాస్ చూస్తాడా? ప్రభాస్‌కు ఇది పట్టించుకునే టైం ఉందని అనుకుంటున్నావా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

  English summary
  Payal Rajput goes instagram live with fans. Fans wishes to pair with Prabhas. In this occassion, She request prabhas that, you have to answer to them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X