నేనేం పతివ్రతను కాదు.. నేను కూడా తాగుతా..
Jabardasth Anchor Sowmya: బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు సౌమ్యా రావు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్‌గా పరిచయమైన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది. షోలో తన అందం, యాంకరింగ్ స్టైల్, పంచులు, కౌంటర్లతో ప్రేక్షకులను అలరించింది. ఎక్కువ కాలం పనిచేయకపోయినా గుర్తుండిపోయే యాంకర్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తానేం పతివత్రను కాదని తన డ్రింకింగ్ హాబిట్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడింది. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
కర్ణాటకలోని షిమోగాలో 1990 సెప్టెంబర్ 29న జన్మించిన సౌమ్యా రావు, అక్కడే పెరిగింది. చదువులు పూర్తి చేసిన తర్వాత 2018లో నటనను కెరీర్‌గా ఎంచుకుంది. తొలుత తమిళ టెలివిజన్ రంగంలో "రోజా" సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత నెంజమ్ మరప్పదిల్లై, వల్లి, మిన్నలే, తిరుమతి హిట్లర్ వంటి సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకుంది. తెలుగు టెలివిజన్ రంగంలోకి కూడా అడుగు పెట్టి "శ్రీమంతుడు" సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మెయిన్ గా కామెడీ షోలో యాంకర్‌గా పని చేసి మరింత పాపులారిటీ దక్కించుకుంది. తనకు వచ్చినంతవరకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకోవడం, హైపర్ ఆదితో పంచులు, కౌంటర్లతో ఎంటర్‌టైన్ చేయడం వల్ల ఆడియెన్స్‌కి బాగా దగ్గరైంది. ఇలా తనకంటూ తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకుంది.

యాంకర్ సౌమ్య తాజాగా జబర్దస్త్ వర్ష యాంకర్ గా చేస్తున్న 'కిసిక్క్ టాక్స్'కి గెస్ట్ గా వచ్చాడు. ఈషోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి బోల్డన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తన లైఫ్‌లోని అనుభవాలను షేర్ చేస్తూ డ్రింకింగ్ హాబిట్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడింది. "పార్టీలో ఏమైనా తాగుతారా?" అని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. సౌమ్య వెంటనే స్పందిస్తూ.. 'అప్పుడప్పుడు వైన్ తాగుతా. మైండ్ ఫ్రెష్‌గా అనిపించడానికి తాగుతా. ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్తే ఒకటి లేదా రెండు పెగ్స్ రెడ్ వైన్ వేయాల్సిందే. ఆ విషయంలో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేం పతివ్రతను కాదు.. తాగను అని ఫేక్‌గా చెప్పడం ఎందుకు? ఏం చేస్తానో అదే ఓపెన్‌గా చెప్పేస్తాను" అని తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌ను చూపించింది.
అయితే అదే సమయంలో ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. 'డ్రింకింగ్ అనేది అలవాటుగా మారకూడదు. జస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఒక లిమిట్‌లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది" అంటూ సలహా ఇచ్చింది. అంతటితో ఆగకుండా యాంకర్ వర్ష మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసింది. "డ్రింక్ చేసిన తర్వాత మైండ్‌లోకి వచ్చేది ఏంటి?" అడగ్గా దీనికి సౌమ్య షాకింగ్‌గా రిప్లై ఇచ్చింది. "టక్కమని నాకు గుర్తుకు వచ్చేది ఇండస్ట్రీ. ఆ డైరెక్టర్ అలా ట్రీట్ చేశాడు.. ఆ ఆర్టిస్ ఇలా బిహేవ్ చేశాడు? ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు.. ఎవరు డైలాగ్ కట్ చేశారు అన్న విషయాలే మైండ్‌లోకి వస్తాయి. నేను మాట్లాడుతే.. 'ఇండస్ట్రీ'అని మొదలెడుతావ్ అని హేళన చేశారు. అందుకే నాతో పార్టీకి రావడం తగ్గిస్తారు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం యాంకర్ సౌమ్య ఈ ఓపెన్ స్టేట్‌మెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆమె ఈ నిజాయితీకి కరెక్ట్‌గా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











