Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కి భయానక అనుభవం.. ఆ నటుడు పబ్లిగ్గా చీర కొంగు పట్టుకుని
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరపై అడుగుపెట్టారు జాన్వీకపూర్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్నారు. హిందీ పరిశ్రమకే పరిమితం కాకుండా తల్లి కోరిక మేరకు టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు ఈ ముద్దుగుమ్మ. అలాంటి జాన్వీకపూర్‌కు స్టేజ్ మీద ఘోర అవమానం జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్‌గా కష్టం
బాలీవుడ్‌లోనే బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ జాన్వీ హీరోయిన్‌గా స్థిరపడటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు జాన్వీ కపూర్. కరణ్ జోహార్ నిర్మాతగా శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన దఢక్ ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టారు. 2018 జూలై 20న విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. అయితే కూతురిని తెర మీద చూసుకోకుండానే శ్రీదేవి కన్నుమూయడం జాన్వీ కపూర్ జీవితంలో తీరని లోటుగా మిగిలిపోయింది.

జాన్వీ డైరీ ఫుల్
దఢక్ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా : ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జా వంటి చిత్రాలలో నటించారు. ఇక జూ.ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి సినిమాతోనే భారీ విజయం సొంతం చేసుకున్నారు జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్దిలో, హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారిలోనూ నటిస్తున్నారు జాన్వీ.
శిఖర్ పహారియాతో రిలేషన్
ఇక జాన్వీ కపూర్ ఎఫైర్లు, రిలేషన్‌లతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేస్తున్నారు. ప్రియుడితో కలిసి వెకేషన్స్, డిన్నర్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. రేపో మాపో పహారియాతో కలిసి జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కుతారని బాలీవుడ్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రముఖ జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తిరుపతిలోనే స్థిరపడాలనుంది
ఎంత మోడ్రన్‌గా ఉంటున్నా, హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పటికీ జాన్వీ కపూర్‌కి దైవభక్తి ఎక్కువే. ఇంట్లో పూజలతో పాటు తనకు వీలున్నప్పుడల్లా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుంటూ ఉంటారు జాన్వీ. అంతేకాదు.. తనకు తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉందని, వివాహం తర్వాత సినిమాలకు వీడ్కోలు చెప్పి ఇక్కడే స్థిరపడాలని ఉందని కూడా చెప్పింది. ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తింటూ గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి, మణిరత్నం సినిమాలలోని పాటలు వింటూ కూర్చోవాలని జాన్వీ తన మనసులోని మాటను చెప్పింది.
స్టేజ్‌పై ఘోర అవమానం
తన సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మిగిలిన హీరోల సినిమా ఈవెంట్స్‌కు కూడా జాన్వీ కపూర్ హాజరవుతూ ఉంటారు. తాజాగా హోంబౌండ్ సినిమా స్క్రీనింగ్ కోసం హాజరైన జాన్వీ కపూర్.. తన తల్లి శ్రీదేవి గతంలో కట్టుకున్న బ్లూ కలర్ శారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. స్టేజ్‌పై ఫోటోలకు ఫోజులిచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా జాన్వీ కపూర్ చీర కొంగుపై ఓ నటుడు కాలు వేశాడు. ఊహించని పరిణామానికి షాకైన జాన్వీ వెనక్కి కోపంగా తిరిగి చూసేసరికి సదరు నటుడు తన కాలు తీసి, ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు శ్రీదేవి కట్టుకొచ్చిన చీరలో జాన్వీ చాలా అందంగా కనిపించారు.


Click it and Unblock the Notifications











