For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాలుగో పెళ్ళికి సిద్దమైన జెన్నిఫర్ లోపెజ్.. 20 ఏళ్ళ క్రితం బ్రేకప్‌ చెప్పిన వ్యక్తితోనే ఇప్పుడు నిశ్చితార్థం!

  |

  హాలీవుడ్‌ తార జెన్నిఫర్‌ లోపెజ్‌ ఒక ఆసక్తికర వార్తతో తెరమీదకు వచ్చింది. ఆమె మరో హాలీవుడ్‌ తార బెన్‌ అఫ్లెక్‌ తో రెండోసారి నిశ్చితార్థం చేసుకుంది. సినీ ఫక్కీలో సాగిన వీరి వ్యవహారం ఇప్పుడు హాలీవుడ్ లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు

  2002లోనే మొదటి సారిగా

  తాను .బెన్‌ అఫ్లెక్‌ తో రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని జెన్నిఫర్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఓ వీడియో సైతం పోస్ట్‌ చేసింది. అయితే ఆమె నిశ్చితార్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు కానీ జెన్నిఫర్‌, అఫ్లెక్‌ గతంలో 2002లోనే మొదటి సారిగా నిశ్చితార్థం చేసుకున్నారు.

   విడాకులు

  విడాకులు


  అలా నిశ్చితార్థం చేసుకున్న రెండేళ్లు బాగానే కలిసున్నా ఆ తరువాత పెళ్లి చేసుకోలేదు కానీ అనూహ్యంగా వీళ్లిద్దర తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడిపోయారు. అలా ఆ తరువాత జెన్నిఫర్‌.. మార్క్‌ ఆంథొనీని పెళ్లాడగా, అఫ్లెక్‌.. జెన్నిఫర్‌ గార్నర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ విడివిడిగా కూడా ఇద్దరి వైవాహిక జీవితాలు సవ్యంగా సాగలేదు. దీంతో ఈ రెండు ప్రేమ జంటలు విడాకులు దాదాపు ఒకే సమయంలో తీసుకున్నాయి.

  ప్రేమలో పడ్డామని హింట్స్


  అలా విడాకులు తీసుకున్న తర్వాత ఈ మాజీ ప్రేమికులు మరోసారి దగ్గరయ్యారు. గతేడాది నుంచి జెన్నిఫర్‌, బెన్‌ అఫ్లెక్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ హాలీవుడ్ లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే వారు కూడా కొత్త జంటలాగా కలిసి వెకేషన్ లకు వెళ్లడం, వర్కవుట్స్‌ మధ్యలో ఇద్దరూ ముద్దులాడుకుంటూ కెమెరా కళ్ళకు చిక్కడం అలాగే రెడ్‌ కార్పెట్‌ మీద కుడా కలిసే దర్శనమివ్వడం వంటి చర్యలతో అవును, తామిద్దరం మళ్లీ ప్రేమలో పడ్డామని హింట్స్ ఇచ్చారు.

  సంతోషిస్తున్నానని

  అలా జెన్నిఫర్ లోపెజ్ - బెన్ అఫ్లెక్ ఇద్దరూ సుమారు ఒక ఏడాది సమయంగా డేటింగ్‌లో ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్ తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శిస్తూ వారి నిశ్చితార్థ వార్తను ధృవీకరిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాక తన ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఈ విషయాన్ని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని ఆమె రాసుకొచ్చింది.

  మూడు పెళ్లిళ్లు


  ఇక జెన్నిఫర్ ఇంతకు ముందు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. జెన్నిఫర్ 1997లో ఓజానీ నోవాను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఒక సంవత్సరం కాపురం చేసిన తర్వాత వారు విడిపోయారు. ఇక ఆ తరువాత, ఆమె 2001 సంవత్సరంలో క్రిస్ జుడ్‌ను వివాహం చేసుకుంది, ఆ వివాహ బంధం కూడా రెండేళ్లకే ముగిసిపోయింది. జెన్నిఫర్ 2004 సంవత్సరంలో మార్క్ ఆంథోనీని మూడవసారి వివాహం చేసుకుంది. సుమారు 10 సంవత్సరాల తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

  షాక్ ఇస్తారా?

  షాక్ ఇస్తారా?

  ఇప్పుడు జెన్నిఫర్ బెన్ నిశ్చితార్థం వార్తలు తర్వాత, అభిమానులు వారి వివాహం కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ జంట ఈసారైనా పెళ్లి చేసుకుంటుందా? లేక మొదటి సారి లాగానే మళ్ళీ అభిమానులకు షాక్ ఇస్తారా? అనేది కాలమే నిర్ణయించాలి మరి. జెన్నిఫర్‌ చివరగా 'మ్యారీ మీ' సినిమాలో నటించగా ప్రస్తుతం ఆమె చేతిలో 'షాట్‌గన్‌ వెడ్డింగ్‌', 'ద మదర్‌' సినిమాలున్నాయి.

  English summary
  Jennifer Lopez And Ben Affleck Are Engaged Again after re uniting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X