Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
నయనతార రికార్డ్ బ్రేక్ చేసిన కాజల్!
కాజల్ అగర్వాల్ దశాబ్దానికి పైగా గ్లామర్ పాత్రలతో మెప్పించిన తర్వాత ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీలో ఘనవిజయం సాధించిన కంగనా రనౌత్ మూవీ క్వీన్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. లాడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్యారిస్ ప్యారిస్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుండడం ఆసక్తిగా మారింది.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
ఈ చిత్రంతో కాజల్ అగర్వాల్ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఏకంగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారకే చెక్ పెట్టేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నయనతార నటించిన కోలమావు కోకిల చిత్ర టీజర్ ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా కోనసాగుతోంది. ఆ రికార్డుని కాజల్ ప్యారిస్ ప్యారిస్ టీజర్ తో అధికమించింది. కొలమావు కోకిల టీజర్ కు 6 మిలియన్ల వ్యూస్ సాధించగా.. ప్యారిస్ ప్యారిస్ ఇప్పటికే 7 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది.

ప్యారిస్ ప్యారిస్ టీజర్ లో కాజల్ నటించిన ఓ అసభ్యకర సన్నివేశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశంలో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. క్వీన్ చిత్రం సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది.