For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరకు గిరిజన పిల్లల కోసం.. కాజల్ షాకింగ్ నిర్ణయం..,చేస్దున్న సహాయం తెలిస్తే ఫిదా కావాల్సిందే!

|
Kajal Agarwal Interview About Kavacham Movie | Filmibeat Telugu

గత దశాబ్దానికిపైగా కెరీర్‌లో కాజల్ అగర్వాల్ 50కిపైగా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన కవచం సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. కవచం సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వెల్లడించింది. మూడో కంటికి తెలియకుండా కాజల్ చేస్తున్న సేవ షాక్ గురిచేస్తున్నది. ఆమె గిరిజనుల కోసం చేస్తున్న సేవ ఏంటంటే..

అరకు వ్యాలీలో గిరిజన పిల్లల కోసం

అరకు వ్యాలీలో గిరిజన పిల్లల కోసం

ప్రస్తుతం నేను అరకు వ్యాలీలో గిరిజన పిల్లల కోసం సేవలందిస్తున్నాను. థింక్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. చాలా కష్టమైన పని అది. దాని కోసం నేను కొంత సమయాన్ని కేటాయిస్తున్నాను. అక్కడ ఓ పాఠశాలను కట్టించాను. అక్కడి పిల్లలకు చదువుతోపాటు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. కేవలం చదువే కాదు. అక్కడి వారికి శానిటేషన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.

చదువుకొనే స్తోమత, సౌకర్యం లేకపోవడం

చదువుకొనే స్తోమత, సౌకర్యం లేకపోవడం

మారుమూల ప్రాంతాల్లో గిరిజన పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం లేదు. అందుకే వారి కోసం ప్రాథమిక విద్యను అందించాలని కోరుకొన్నాను. సమాజంలో మంచి వాళ్లు ఎంత మందో ఉన్నారు. మరుగున పడిన, సమాజానికి దూరంగా ఉండే వాళ్ల కోసం పనిచేసే వారికి సహకారం అందించాలి. అలాంటి ప్రజల కోసం నేను చొరవ తీసుకొన్నాను.

యువ హీరోకు నిక్‌నేమ్ పెట్టిన కాజల్ అగర్వాల్.. ఫన్నీగా ఏమని పిలుస్తుందంటే..!

 సేవాగుణంతో ఉన్న వారిని

సేవాగుణంతో ఉన్న వారిని

అరకు వ్యాలీలోని గిరిజనుల సంక్షేమం కోసం అమెరికాలో కొంత మందిని కలిసి సహాయం చేయమని అడిగాను. చాలా మంది వెంటనే ముందుకు వచ్చారు. సేవా గుణంగా వారిని ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాను. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

అరకు వ్యాలీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం

అరకు వ్యాలీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం

అరుకు వ్యాలీలో నేను గిరిజన స్కూల్‌ను స్థాపించడానికి, అక్కడి వాళ్లకు సహకారం అందించడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. నేను ఎక్కువ సార్లు షూటింగ్‌లకు కోసం అక్కడికి వెళ్లడం వలన నాకు ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. అక్కడి వారి పరిస్థితులు చూసి నేను ఏదో ఒకటి చేయాలని అనుకొన్నాను. అందుకే అక్కడ స్కూల్ కట్టించాను.

నాకు తీవ్రమైన అనారోగ్యం.. మూణెళ్లు హాస్పిటల్‌లోనే, మెడిసిన్ తీసుకొంటూ.. కాజల్

బిజీగా ఉండటం వల్ల వెళ్లడం

బిజీగా ఉండటం వల్ల వెళ్లడం

అరకు వ్యాలీకి వెళ్లడం కుదరడం లేదు. బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడూ వారితో మాట్లాడుతాను. వాళ్లు పంపించే ఫొటోలు చూస్తే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. కాజోల్ అక్క అంటూ పిల్లలు చేసే సందడిని వీడియోల రూపంలో పంపిస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది.

నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు

నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు

అరకు వ్యాలీలో నేనే చేస్తున్న సేవలు నాకు సంతృప్తిని ఇస్తున్నాయి. ఇవన్నీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకోలేను. నేను చేస్తున్న సేవను గొప్పగా చెప్పుకోవడం, ప్రతిఫలం పొందడం నాకు అసలే ఇష్టం ఉండదు. అందుకే ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాను.

English summary
Kavacham is a action entertainer movie directed by Sreenivas Mamilla and produced by Naveen Sontineni (Nani) under Vamsadhara Creation banner while Thaman S scored music for this movie. Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal and Mehreen Pirzada are played the main lead roles along with Bollywood actor Neil Nitin Mukesh playing in negative role in this movie. This movie set to release on December 7th. In this occassion, Kajal Aggarwal speaks to Teugu Filmibeat.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more