twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ గర్భం మీద కూడా ట్రోల్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిందిగా!

    |

    కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తన ప్రెగ్నెన్సీ దశను దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ అనేక ఫోటోలను పోస్ట్ చేస్తోంది. అయితే అలా బేబీ బంప్ ఫోటోలు పంచుకోవడమే కాదు. గర్భధారణ దుస్తులలో ఫోటోలు పెడుతూ ఉండడంతో ఆమె మీద ట్రోల్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. దీంతో ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టి వారందరి నోరు మూయించేలా సమాధానం ఇచ్చింది. ఆ వివరాలు

    Recommended Video

    Kajal Aggarwal Slams Body Shamers గర్భవతులకు టిప్స్..సమంత సపోర్ట్ | Filmibeat Telugu
     ఎవరికీ ఉపయోగం

    ఎవరికీ ఉపయోగం

    రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ కుమారుడితో ఓ యాడ్ లో నటించారు. అందులో కాజల్ బేబీ బంప్ తో కనిపించింది. అయితే చాలా మంది ఆమె ఫిజిక్ గురించి ఆమె శరీర భాగాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఈ విషయంలో బాధ పడిన ఆమె తన బాధను వెళ్లగక్కింది. స్త్రీ గర్భాధారణకి ముందు ...ఆ తర్వాత తన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ..ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ గురించి మాట్లాడే వారి వల్ల, కామెంట్లు, మీమ్‌లు, ట్రోల్స్ చేసే వారి వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఆమె పేర్కొంది.

     శిశువుకి తగినట్లుగా

    శిశువుకి తగినట్లుగా

    గర్భధారణ సమయంలో ఆడవాళ్లు బరువు పెరుగుతారని.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని కాజల్ చెప్పుకొచ్చింది. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ పొట్ట, బ్రెస్ట్ పెరుగుతుందని.. శిశువుకి తగినట్లుగా శరీరం సిద్ధమవుతుందని తెలిపింది. దీని కారణంగా చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయని.. కొన్ని సార్లు చర్మం చిట్లుతుంది, బాడీ కూడా అలసిపోతుంది అని ఆమె పేర్కొంది.

    చాలా సహజమైనవి

    చాలా సహజమైనవి

    అయితే ఈ సమయంలో నెగిటివ్ థింకింగ్ వలన అనారోగ్యం పాలవుతామని.. అది మన శరీరానికి బిడ్డకు మంచిది కాదని ప్రెగ్నెంట్ లేడీస్ కి సూచించింది. మునుపటి స్థితికి శరీరం రావడానికి కొంత సమయం పట్టొచ్చు.. ఒకవేళ రాకపోయినా పర్లేదు.. ఈ మార్పులు చాలా సహజమైనవి అంటూ చెప్పుకొచ్చింది. చిన్నారికి జన్మనివ్వడమనేది ఒక సెలబ్రేషన్ అని కాజల్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. మన జీవితంలో అత్యంత అందమైన, అద్భుతమైన, విలువైన దశలో అసౌకర్యానికి లేదా ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదని ఆమె పేర్కొంది.

     అసౌకర్యంగా ఉంటాయి

    అసౌకర్యంగా ఉంటాయి

    బిడ్డకు జన్మనిచ్చే మొత్తం ప్రక్రియ అనేది గొప్ప అనుభూతి, నాతో పాటు ఈ అద్భుతమైన దశలో ఉన్న వారికి ఈ పోస్ట్ సహాయపడుతుందని ఆశిస్తున్నానని కాజల్ పేర్కొంది. నా ప్రేమను మీకు పంపుతున్నాను..అని కాజల్ అగర్వాల్ పేర్కొన్న సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది. అలాగే గర్భధారణతో వచ్చే కొన్ని శరీర మార్పులు అసౌకర్యంగా ఉంటాయి, కానీ అవన్నీ మీ పెరుగుతున్న బిడ్డకు మద్దతు ఇస్తాయి. గర్భం శాశ్వతంగా ఉండదని ఆమె పేర్కొంది.

    భావాలను వ్యక్తపరచండి

    మీ శరీరం చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. మీ బిడ్డ ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి మీ శరీరం మారుతోంది. ఇది మామూలే, ఈ సమయంలో మీ భావాలను వ్యక్తపరచండి. మీరు ఎలా భావిస్తున్నారనే దాని గురించి మీ భాగస్వామి, కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడండి. మీ భావాలను మీలోనే ఉంచుకుంటే మీరు మరింత స్ట్రెస్ ఫీల్ అవుతారు అని పేర్కొంది.


    సాధారణ వ్యాయామం చేయండి, తేలికపాటి ఈత లేదా నడక మీ మనస్సును క్లియర్ చేయడానికి మరియు మీ బాడీ మీద దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుందని పేర్కొన్నారు. మీ శరీరం ఎలా కనిపిస్తుందనే దానిపై తక్కువ దృష్టి పెట్టడం మరియు మీ శరీరం మరియు మీ మనస్సు మధ్య ఉన్న లింక్‌పై ఎక్కువ దృష్టి పెట్టడంలో యోగా మీకు సహాయపడుతుందని పేర్కొంది. గర్భం గురించి మీకు వీలైనంత ఎక్కువ తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండని ఆమె పేర్కొంది.

    English summary
    Kajal Aggarwal strong reply to trollers trolling about her physic in pregnancy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X