twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు నిజమే అంటున్న కాజోల్

    |

    సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేవి నిజమే అని బాలీవుడ్ నటి కాజోల్ అంగీకరించారు. తన తాజాగా సినిమా 'హెలికాప్టర్ ఈల' అనే ప్రమోషన్లో పాల్గొన్న ఆమెకు తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ ఇష్యూ గురించి ప్రశ్న ఎదురైంది. అయితే ఆ వివాదం గురించి ఏమీ తెలియదన్నారు.

    కాజోల్ స్పందిస్తూ... లైంగిక వేధింపులు అనేది చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని చోట్లా ఉన్నాయి. అయితే తాను ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కోలేదని, ఇండస్ట్రీలో కొందరు ఇలాంటి సంఘటనలు ఫేస్ చేసినట్లు విన్నాను అని తెలిపారు.

     Kajol accepted that sexual harassment is “definitely the reality”

    లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారు ఎవరూ తాము ఈ పని చేశామని ఎక్కడా చెప్పుకోరు. అయితే ఇందులో నిజం ఎంత అనేది కూడా నాకు తెలియదు. ఒక వేళ నా ముందు అలాంటివి ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోను అని కాజోల్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో మాదిరిగా #మీటూ లాంటి ఉద్యమాలు మన దేశం కూడా ఉధృతం కావాల్సిన అవసరం ఉంది అని కాజోల్ అభిప్రాయ పడ్డారు.

    కాజోల్ నటిస్తున్న 'హెలికాప్టర్ ఈల' సినిమా విషయానికొస్తే... ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమె భర్త అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. కాజోల్, రిద్ది సేన్, తోట రాయ్ చౌదరి, నేహా ధూపియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    During promotions of her upcoming film, Helicopter Eela. Kajol saying that she has never had a personal experience like the one described by Tanushree or witnessed something of this sort, she has heard of such experiences but in “the rumour form”. Kajol accepted that sexual harassment is “definitely the reality” while saying that she is not fully acquainted with the details of allegations levelled by Tanushree Dutta against Nana Patekar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X