»   » ఏ బ్యాగ్రౌండ్ లేదు, పదేళ్లు కష్టపడ్డా... నీలాగా నా తండ్రి వారసత్వం లేదు!

ఏ బ్యాగ్రౌండ్ లేదు, పదేళ్లు కష్టపడ్డా... నీలాగా నా తండ్రి వారసత్వం లేదు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kangana Gets Serious On Sonam Kapoor

  బాలీవుడ్ యాక్టర్లలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండే వ్యక్తుల్లో కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీరు ఎలాంటి విషయాలైనా నిర్మొహమాటంగా, ఏ మాత్రం సంకోచించకుండా బయటకు అనేస్తారు. తాజాగా ఓ విషయంలో ఇద్దరూ గొడవ పడే స్థాయికి వెళ్లారు. పర్సనల్‌‌గా వీరి మధ్య ఎలాంటి విబేధాలు లేక పోయినా... #మీటూ ఉద్యమం నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సోనమ్ కపూర్ స్పందించిన తీరు కంగనాకు కోపం తెప్పించింది. ఆవిడ కూడా ఏ మాత్రం తగ్గకుండా సోనమ్ మీద మాటల దాడికి దిగింది. గొడవ ఎలా ఎలా వచ్చిందనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

  ఆ డైరెక్టర్ బండారం బయట పెట్టిన కంగనా

  ఆ డైరెక్టర్ బండారం బయట పెట్టిన కంగనా

  #మీటూ ఉద్యమంలో భాగంగా కంనగా రనౌత్ ‘క్వీన్' మూవీ డైరెక్టర్ వికాస్ బాల్ గురించి స్పందిస్తూ అతడి లైంగిక వేధింపుల గురించి బయట పెట్టింది. అతడి తీరు వింతగా ఉంటుంది. విష్ చేసే నెపంతో హగ్ చేసుకుని గట్టిగా నిలిపేస్తాడు. నా మెడకు అతడి ముఖం ఆనించి నా వెంట్రుకలు వాసన చూస్తాడు. అతడి కౌగిలి విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకిలా చేస్తున్నావంటే నీ దగ్గర నుండి వచ్చే వాసన నాకు ఇష్టం అనేవాడు... అని కంగనా చెప్పిన సంగతి తెలిసిందే.

  ఆమెను నమ్మలేం అంటూ కంగనాపై సోనమ్

  ఆమెను నమ్మలేం అంటూ కంగనాపై సోనమ్

  ‘‘కంగనా ఎప్పటికీ కంగనానే. ఆమె దగ్గర చాలా విషయాలు ఉంటాయి. కొన్ని సార్లు వాటిని సీరియస్‌గా తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. ప్రతిసారి నమ్మలేం. అయితే కంగనా తాను నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం నాకు నచ్చుతుంది. ఈ విషయంలో ఆమెపై గౌరవం ఉంది. అయితే అతడి గురించి నాకు తెలియదు, ఆ సందర్భంగా ఏంటో కూడా తెలియదు. అదే నిజం అయితే తప్పు చేసిన వారు శిక్షింప బడాల్సిందే''... అని సోనమ్ వ్యాఖ్యానించారు.

   సోనమ్ కామెంట్లపై కంగనా ఫైర్

  సోనమ్ కామెంట్లపై కంగనా ఫైర్

  కంగనా మాటలు నమ్మలేం అంటూ సోనమ్ చేసిన వ్యాఖ్యలపై.... ఆమె సీరియస్ అయ్యారు. మరో ఇంటర్యూలో కంగనా రియాక్ట్ అవుతూ.... ‘నేను నాకు ఎదురైన అనుభవాల గురించి చెప్పాను. అయినా నన్ను జడ్జ్ చేయమని ఆమెను ఎవరు అడిగారు? ఈ మహిళ చెప్పేది నిజం... ఈ మహిళ చెప్పేది నిజంకాదు అని స్టేట్మెంట్స్ ఇచ్చే లైసెన్స్ కానీ, ఆధారం కానీ ఆమె వద్ద ఉందా? అంటూ ఫైర్ అయ్యారు.

   ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా... నీలాగా నా తండ్రి హీరో కాదు!

  ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చా... నీలాగా నా తండ్రి హీరో కాదు!

  నేను ఒక ఇండస్ట్రీలో సొంతగా ఎదిగాను. పలు అంతర్జాతీయ వేడుకల్లో నా దేశం తరపున పాల్గొన్నాను. దాదాపు పదేళ్లు కష్టపడి నాకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాను. సోనమ్ కపూర్ మాదిరిగా తండ్రి ద్వారా నాకు గుర్తింపు రాలేదు. సినీ వారసత్వం అంతకన్నా లేదు అని.... కంగనా స్పష్టం చేశారు.

  English summary
  Kangana lashed out at Sonam for her "can't take her seriously" statement. The Queen actress said, "What does she mean by saying, 'it's hard to believe Kangana'? When I am sharing my Me Too story, who gives her a right to judge me? So, Sonam Kapoor has the license of trusting some women and some she won't. I am known to be an articulate person, I have represented my country in many international summits, I am called as a thought and youth influencer to these summits, I am not known because of my dad I have earned my place and credibility after struggling for a decade."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more