twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమయం లేదు మిత్రమా.. 100 కోట్లు పిండేశా.. గురువుకు కంగన రనౌత్ పంగనామాలు

    |

    బాలీవుడ్‌లో విలక్షణ నటి కంగన రనౌత్‌కు వరుస విజయాలు దక్కినా వివాదాలు చుట్టముట్టడం తప్పలేదు. మణికర్ణిక వివాదం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదనే అనిపిస్తుండగానే ఇమాలి సినిమా వివాదంలో చిక్కుకున్నారు. తన గురువు అనురాగ్ బసు సినిమా నుంచి కంగన తప్పుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఈ వివాదంలో అసలు విషయమేమిటంటే...

    ఇమాలి నుంచి తప్పుకొన్న కంగన

    ఇమాలి నుంచి తప్పుకొన్న కంగన

    తాను అనురాగ్ బసు సినిమా నుంచి తప్పుకోవడంపై కంగన స్పందిస్తూ.. గతేడాది పంగా, ఇమాలి సినిమాలు ఒకేసారి అనౌన్స్ అయ్యాయి. కానీ మణికర్ణిక సినిమాకు డైరెక్టర్‌గా మారడంతో ఇమాలి షూటింగ్ వాయిదా వేశాం. మణికర్ణిక తర్వాత పంగా సినిమా మొదలైంది. కొన్ని కారణాల వల్ల ఇమాలి సెట్స్‌పైకి వెళ్లలేకపోయింది.

    మణికర్ణిక సినిమా తర్వాత

    మణికర్ణిక సినిమా తర్వాత

    మణికర్ణిక సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత నటనపట్ల, కెరీర్ విషయంలో నా ఆలోచన తీరు మారింది. శక్తిమంతమైన స్త్రీ పాత్రలపై దృష్టిపెట్టాను. అంతేకాకుండా డైరెక్టర్‌ కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టాలనుకొంటున్నాను. నాకు ఇప్పుడు ఇమాలిలో నటించే సమయం లేదు. ఆ సినిమాను డైరెక్ట్ చేసే వీలు లేదు అని కంగన వివరణ ఇచ్చింది.

    జయలలిత బయోపిక్‌ తలైవిలో

    జయలలిత బయోపిక్‌ తలైవిలో

    మణికర్ణిక సినిమా తర్వాత నేను జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నాను. అది పవర్‌ఫుల్ క్యారెక్టర్. మహిళ సాధికారిత కనిపించే పాత్ర అది. జయలలిత పాత్రలో నటించడమంటే అషామాషీ కాదు. జయలలిత బయోపిక్ తలైవి సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. అందుకే ఇమాలి సినిమా నుంచి తప్పుకొన్నాను అని కంగన చెప్పింది.

    నా గురువుతో సినిమా తర్వాత

    నా గురువుతో సినిమా తర్వాత

    ఇమాలి సినిమా గురించి అనురాగ్ బసుతో చర్చించాను. ఇమాలితో నాకు గురువు లాంటి బసుతో పనిచేసే అవకాశం లభించిందని సంతోషపడ్డాను. మారిన పరిస్థితుల వల్ల ఆ సినిమా చేయలేకపోవడం బాధాకరం. ఇమాలి మంచి లవ్‌స్టోరి. ఆ సినిమాను ఎప్పుడైనా చేయవచ్చు. త్వరలోనే గురువు లాంటి అనురాగ్ బసుతో కలిసి పనిచేస్తాను అని కంగన వెల్లడించింది.

    100 కోట్ల తర్వాత.. పెద్ద ప్రాజెక్ట్‌పై

    100 కోట్ల తర్వాత.. పెద్ద ప్రాజెక్ట్‌పై

    మణికర్ణిక సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మళ్లీ ఆ రేంజ్‌లో ఉండే సినిమాపై దృష్టిపెట్టాను. డైరెక్టర్‌గా భారీ సినిమాలు తీయాలని ఎదురుచూస్తున్నాను. రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమాలే చేయాలి. నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే కరెక్ట్ సమయం భావిస్తున్నాను అని కంగన చెప్పింది.

    English summary
    Kangana Ranaut has bowed out of Anurag Basu's Imali as she wanted to focus on her directorial venture. Kangana is making a shift in her career choices and wants to focus on bringing stories of powerful women alive on celluloid.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X