డబ్బులు లేక పన్ను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నా.. కంగన రనౌత్ షాకింగ్ పోస్టు
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ వరుస చిత్రాలతో అలరిస్తుండటమే కాకుండా వివాదాలతో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జాతీయ మీడియాలో ఆమె వెల్లడించిన అభిప్రాయాలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అలాగే ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన పోస్టుల పెట్టడంతో ఆమె అకౌంట్‌ను ట్విట్టర్ తొలగించడం మరింత వివాదంగా మారింది. అలాగే ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంపై ఆమె వ్యక్తం చేసిన ఆవేదన మరింత చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే.. కరోనావైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి విషయాలు ఆమె కెరీర్‌పై భారీగా ప్రభావం చూపాయనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కంగన రనౌత్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. నా ఆదాయంలో 45 శాతం మేర చెల్లించే విధంగా అత్యధిక ట్యాక్స్ స్లాబ్‌ను విధించారు. బాలీవుడ్‌లో అత్యధికంగా పన్ను చెల్లించే నటి అనే పేరు ఉన్నప్పటికీ.. ఇంకా నేను ఆదాయ పన్ను చెల్లించలేదు. ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
హాట్ హాట్‌గా ఓవియా హెలెన్.. వానలో తడిసిన అందాలతో ప్రియుడితో శృంగారం (ఫోటోలు)

ఈ ఏడాది ఆలస్యంగా పన్ను చెల్లిస్తున్నందున్న చెల్లించని మొత్తంపై వడ్డీని వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుకు ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితులు వ్యక్తిగతంగానే కాకుండా అందరికి కష్టంగా, భారంగా మారాయి అని కంగన రనౌత్ చెప్పారు.
తాజాగా ఆమె తేజాస్, మణికర్ణిక రిటర్న్స్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందించిన ధాకడ్ చిత్రంతోపాటు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో నటించారు. ఈ చిత్రాలు ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











