»   »  అతడికి సెక్స్ వ్యసనం, నా వాసన ఇష్టం అంటూ నిలిపేసేవాడు: కంగనా

అతడికి సెక్స్ వ్యసనం, నా వాసన ఇష్టం అంటూ నిలిపేసేవాడు: కంగనా

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానీ, వికాలస్ బాల్, నిర్మాత మధు మంతెన కలిసి స్థాపించిన ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ 'ఫాంటమ్ ఫిల్మ్స్' సంస్థ పేరు ఇకపై వినపడదు. ఈ నలుగురూ సంస్థను రద్దు చేసి ఇకపై ఎవరిదారిలో వారు ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం ప్రకటించిన కొన్ని గంటలకే ఫాంటమ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన వికాస్ బాల్ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశం అయింది.

  ఆయనకు చెప్పినా పట్టించుకోలేదు

  ఆయనకు చెప్పినా పట్టించుకోలేదు

  ఆ సమయంలో ఈ విషయాన్ని తాను అనురాగ్య కశ్యాప్‌ను వెల్లడించాను. అయితే రెండేళ్ల వరకు ఆయన దీన్ని పట్టించుకోలేదు అని సదరు మహిళ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫాంటమ్ సంస్థ రద్దవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ విషయం చర్చనీయాంశం అయింది.

   కంగనా రనౌత్ మద్దతు

  కంగనా రనౌత్ మద్దతు

  వికాస్ బాల్ దర్శకత్వంలో ‘క్వీన్' మూవీ చేసిన కంగనా రనౌత్ సదరు మహిళకు మద్దతు తెలిపారు. ఆ మహిళ చెబుతున్న విషయాలను తాను నమ్ముతున్నట్లు తాజాగా ఇండియా టుడే ఇంటర్వయూలో వెల్లడించారు.

   అతడికి సెక్స్ వ్యవసనం ఉంది

  అతడికి సెక్స్ వ్యవసనం ఉంది

  క్వీన్ సినిమా సమయంలోనే వికాస్ బాల్ పెళ్లి జరిగింది. ఆ సమయంలో కూడా అతడు రోజు విడిచి రోజు ఒక కొత్త అమ్మాయిలతో క్యాజువల్ సెక్స్ చేసే వాడిని అని గొప్పగా చెప్పుకునేవాడు. ఇతరుల అలవాట్ల గురించి నేను జడ్జ్ చేయను కానీ ఆ అలవాటు ఒక వ్యసనంగా మారినపుడు చెప్పడంలో తప్పులేదు అని నా ఉద్దేశ్యం... అని ఇండియా టుడే ఇంటర్వ్యూలో కంగనా తెలిపారు.

  పార్టీలకు రావడం లేదని గేలిచేవాడు

  పార్టీలకు రావడం లేదని గేలిచేవాడు

  క్వీన్ సినిమా సమయంలో నేను అలసిపోయి త్వరగా నిద్రపోయేదాన్ని. నైట్ పార్టీలకు వెల్లేదాన్ని కాదు. ఈ విషయాన్ని వికాస్ బాల్ యూనిట్ సభ్యులు ముందు ప్రస్తావిస్తూ నన్ను గేలి చేసేవాడు అని కంగనా గుర్తు చేసుకున్నారు.

   వాసన చూస్తూ నన్ను నలిపేసేవాడు

  వాసన చూస్తూ నన్ను నలిపేసేవాడు

  క్వీన్ సినిమా సమయంలో సోషల్ ఈవెంట్స్‌లో వికాస్ బాల్‌ను కలిసినప్పుడల్లా భయం వేసేది. హగ్ చేసుకుని గట్టగా నలిపేసినంత పని చేసేవాడు. నా మెడకు అతడి ముఖాన్ని ఆనించి నా వెంట్రుకలు వాసన చూసేవాడు. అతడిని వదిలించుకోవడానికి ఇబ్బంది పడేదాన్ని.....ఎందుకిలా చేస్తున్నావంటే ‘నీ దగ్గర నుండి వచ్చే వాసన అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పేవాడు అని కంగనా గుర్తు చేసుకున్నారు.

   ఆ అమ్మాయి ఆరోపణలు నమ్ముతున్నాను

  ఆ అమ్మాయి ఆరోపణలు నమ్ముతున్నాను

  వికాస్ బాల్ మీద ఆ అమ్మాయి చేసే ఆరోపణలను నేను నమ్ముతున్నాను. ఇపుడు ఫాంటమ్ సంస్థ రద్దవుతుంది కాబట్టి అతడి మీద మూకుమ్మడి దాడిగా అను కోవద్దు. గతంలోనూ ఆ అమ్మాయికి మద్దతుగా నేను మాట్లాడాను అని కంగనా వెల్లడించారు.

  English summary
  Kangana said, that Bahl despite being married, would often boast about having casual sex with a new partner, every other day. She said, "Totally believe her. Even though Vikas was married back in 2014 when we were filming Queen, he bragged about having casual sex with a new partner every other day. I don't judge people and their marriages but you can tell when addiction becomes sickness. He partied every night and shamed me for sleeping early and not being cool enough."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more