Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రజనీకాంత్ అనుకొని తప్పులో కాలేసిన ఖుష్బూ.. క్షమాపణలు చెప్పి
ప్రపంచంలో మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉంటారనేది తెలిసిందే. మనకు తెలిసిన రూపు రేఖలుండే వ్యక్తిలాంటి మరో వ్యక్తి తారసపడటం సహజంగా జరుగుతుంది. కొన్నిసార్లు అలా మనం తప్పులో కాలేయడం కూడా సర్వసాధారణంగా మారుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం సీనియర్ నటి ఖుష్భూకు ఎదురైంది. దాంతో సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ఏమైందంటే...
కుష్బూ ప్రస్తుతం లండన్‌లో విహార యాత్ర చేస్తున్నది. తన స్నేహితురాలితో కలిసి ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో షాపింగ్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న ఫొటోను చూసి థ్రిల్‌గా ఫీలయ్యింది. రజనీకాంత్ మాదిరి ఫొటో సెల్‌ఫోన్ బ్యాక్ కవర్ లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో కనిపించింది. దానిని చూడగానే హ్యాపీగా ఫీలై అంటూ ఆ ఫోటోను కెమెరాలో బంధించి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అంతేకాకుండా రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌కు ట్యాగ్ చేసింది.

అయితే మొబైల్ బ్యాక్ కవర్ మీద ఉంది రజనీకాంత్.. ఎమిర్ ఆఫ్ కతార్ తమీమ్ బిన్ హమద్ అని తెలియడంతో తప్పు చేశానని కుష్బూ తెలుసుకొన్నది. వెంటనే క్షమాపణలు చెబుతూ.. ఒకే.. నేను ట్యాగ్ చేసిన ఫోటో రజనీకాంత్‌ది కాదు. నా తప్పును సరిదిద్దిన నా మంచి మిత్రులకు థ్యాంక్స్. తప్పును ఒప్పుకోవడం మనిషి పరిణతి, హుందాతనానికి చిహ్నం. తప్పుల నుంచే పాఠాలు నేర్చుకొంటాం అని ఖుష్భూ మరో ట్వీట్ చేసింది.
Ok .. so that’s not our very #SuperStarRajinikanth .. thank you my good friends out here for correcting me. Accepting a mistake shows you are ready to grow and I am.. evolving is human.. learning from mistakes, humanity 🙏🏻🙏🏻🙏🏻😊😊👍🏻👍🏻👍🏻👍🏻 https://t.co/3LHElvPZux
— KhushbuSundar ❤️❤️❤️ (@khushsundar) August 28, 2019
ఇక ఖుష్బూ విషయానికి వస్తే.. తమిళ తెర మీద దేవతగా కీర్తించ బడిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఆమె చివరిసారిగా తెలుగులో అజ్ఞాతవాసి చిత్రంలో నటించారు.