For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యువ హీరోతో రొమాంటిక్ లైఫ్.. అంత సీన్ లేదన్న రామ్ చరణ్ హీరోయిన్!

  |

  సినిమా ప్రపంచంలో సినీ తారల మధ్య ప్రేమ బంధాలు కొనసాగడం సర్వసాధారణ విషయం. అది అందరికీ తెలిసిందే. హీరో హీరోయిన్స్ ప్రేమలో ఉన్నట్లు ప్రతి ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా వినిపించే రూమర్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ నిజంగా ప్రేమ బంధాలు పెళ్లి వరకు వచ్చినప్పటికీ అందులో ఎన్ని పక్షులు పెళ్లి వరకు కొనసాగుతాయో తెలియదు. రెగ్యులర్ గా బ్రేక్ అప్ స్టోరీలు కూడా ఇండస్ట్రీలో చాలానే వినిపిస్తుంటాయి. ఇటీవల అమీర్ ఖాన్ తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే ఆ వార్తతో మిగతా బాలీవుడ్ స్టార్ కపుల్స్ పై కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్ళికి సిద్ధంగా ఉన్న ప్రేమ పక్షులు కూడా చాలానే ఉన్నాయని ఇందులో రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఉన్నట్లు టాక్ బాగానే వస్తోంది.

  క్లారిటీ ఇవ్వకపోవడంతో..

  క్లారిటీ ఇవ్వకపోవడంతో..

  ఈ బ్యూటీ గత కొంత కాలంగా ఒక యువ హీరోతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. కొన్నిసార్లు ఆ వార్తలపై స్పందించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించ లేదు. సదరు యువ హీరో కూడా ప్రేమ విషయంపై పెద్దగా స్పందించకపోవడం వలన వార్తలు మరింత ముదిరాయి. ఇక కియారా అద్వానీ చాలా కాలం తర్వాత ఊహించని విధంగా స్పందించారు. ముందుగా కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్లో అవకాశాల కోసం ఒకప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే విజయాలు దక్కలేదు.

   సినిమా కెరీర్

  సినిమా కెరీర్

  ఇక మెల్లగా చిన్న సినిమాలతోనే కాలం గడుపుతూ.. వచ్చిన చిన్న విజయలతోనే స్టార్ హోదా ను పెంచుకుంది. ఒక విధంగా స్టార్ హోదాను అందుకోవడానికి కొంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. 2014లో ఫగ్లీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ అనంతరం ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీలో సాక్షి రావు పాత్రలో కనిపించింది. అనంతరం పెద్దగా అవకాశాలు దక్కలేదు. టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తుండడంతో కాదనలేకపోయింది. 2018లో మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో భరత్ అనే నేను సినిమా లో మెయిన్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

   వరుస విజయాలు

  వరుస విజయాలు

  ఆ సినిమా హిట్ అవడంతో అమ్మడుకి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి ఆ తర్వాత ఏడాది రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కూడా గ్లామర్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అమ్మడు మళ్లీ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లస్ట్ స్టోరీస్ తర్వాత బాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కాయి. కబీర్ సింగ్ తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగింది. ఆ సినిమా టాలీవుడ్ అర్జున్ రెడ్డి మూవీ కి రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే.

  యువ హీరోతో అలాంటి రిలేషన్ పై క్లారిటీ

  యువ హీరోతో అలాంటి రిలేషన్ పై క్లారిటీ

  ఇక కియారా అద్వానీ ప్రేమ కథ విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు బాగానే వచ్చాయి. మీడియా ముందు కీయరా ప్రతిసారీ కూడా ఆ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల షేర్ షా సినిమా లో నటించిన ఇద్దరు స్టార్స్ ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో రొమాంటిక్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ప్రశ్నలకు కైరా అద్వానీ తనదైనా శైలిలో క్లారిటీ ఇచ్చింది. అందరూ అనుకున్నట్టుగా సిద్ధార్థతో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. అతను నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే.. ఒక కోస్టార్ లాగానే భావిస్తాను అని కియారా అద్వానీ కుండ బద్దలు కొట్టేసింది.

  యువ హీరో మౌనం

  యువ హీరో మౌనం

  అయితే ఇంతవరకు సిద్ధార్థ్ మాత్రం ఆ విషయంపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. గతంలో చాలా మంది హీరోయిన్లు ఇదే తరహాలో కామెంట్ చేసి అనంతరం పెళ్లి చేసుకొని మరింత షాక్ ఇచ్చారు. మరి కియారా అద్వానీ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతానికైతే తన ఫోకస్ మొత్తం సినిమా కెరీర్ పైనే ఉందని తను సాధించాల్సినవి కూడా చాలా ఉన్నాయని అవన్నీ పూర్తయిన తర్వాతనే పెళ్లి గురించి ప్రేమ గురించి ఆలోచిస్తాను అంటూ మరింత క్లారిటీగా చెప్పేసింది.

  Tollywood లో Anirudh Ravichander హవా, అదొక్కటే ఛాలెంజ్..| NTR 30 || Filmibeat Telugu
  కియారా అద్వానీ సినిమాలు..

  కియారా అద్వానీ సినిమాలు..

  ఇక కియారా అద్వాని ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టులో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదివరకే రామ్ వినయ విధేయ రామ లో కనిపించిన ఈ జోడి ఇప్పుడు శంకర్ సినిమాలో కూడా కనిపించబోతున్నారు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అలాగే కియారా అద్వానీకి జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లు అయితే టాక్ వచ్చింది. అయితే ఆ కథపై అమ్మడు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయట మొదట చత్రపతి రీమేక్ కోసం కూడా కియారా అద్వానీని సంప్రదించారు. కానీ అమ్మడు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసింది.

  English summary
  Bollywood actress Kiara Advani strong comments on young hero relationship and love rumours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X