Krithi shetty: ఉప్పెన బ్యూటీకి ఒకేసారి అంత ఇస్తున్నారా? అస్సలు తగ్గట్లేదుగా!
క్యూట్ గర్ల్ కృతి శెట్టి రెండు పదుల వయసులోకి రాకముందే భారీ ఆఫర్స్ అందుకుంటోంది. 2003లో జన్మించిన ఈ యంగ్ హీరోయిన్ వయసు ప్రస్తుతం 17 ఏళ్ళు. ఇంకా టీనేజ్ దాటకముందే స్టార్ హీరోయిన్స్ పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మొదటి సినిమా ఉప్పెన అమ్మడి కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అందులో కృతి నటనకు స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. కేవలం రొమాంటిక్ సీన్స్ లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
దీంతో మీడియం రేంజ్ హీరోలు చాలా వరకు కృతి పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఉప్పెన విడుదల కాకముందే అమ్మడికి రెండు ఆఫర్స్ అయితే వచ్చాయి. నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు సుధీట్ బాబు - మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఇక రీసెంట్ గా రామ్ - లింగుస్వామి సినిమాలో కూడా అవకాశం రావడంతో అమ్మడు రెమ్యునరేషన్ డోస్ కూడా ముందుగానే పెంచేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 75లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. నాగార్జున బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించనున్న కృతి ఇదే రేంజ్ లో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి వారు భారీ ఆఫర్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక కృతి శెట్టి మెల్లగా తన రేంజ్ ను పెంచుకోవడంతో త్వరలోనే వారికి పోటీకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇంకా అమ్మడు సరైన గ్లామర్ డోస్ పెంచలేదు. మరి భవిష్యత్తులో అలాంటి పాత్రలు వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











