నాకు ఆ టైప్ మగాళ్ళు నచ్చరు.. ఉప్పెన హీరోయిన్‌కు ఎలాంటి మగాళ్లు ఇష్టమంటే!
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఉప్పెన సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు అలాగే దర్శకుడికి కూడా మంచి పేరు వచ్చింది. దర్శకుడు అయితే ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో పని చేస్తారని ప్రచారం జరుగుతోంది.. వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పటికే ఒక సినిమా పూర్తి చేసి మూడో సినిమా కూడా మొదలు పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటించిన కృతి శెట్టికి సైతం మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ భామ తనకు ఎలాంటి వాడు కావాలి అనే దాని మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కెమెరాకు చిక్కిన ప్రిన్స్ నరులా, యువిక.. ఫొటోస్ వైరల్

ఉప్పెన క్రేజ్
ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ పెరిగిపోయింది. తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా, అలాగే లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ అమ్మడు అవకాశం దక్కించుకుంది. మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న సినిమాలో కూడా ఈ అమ్మడు ఎంపిక అయ్యింది.

ఆ సినిమాలే చేస్తున్నా
అయితే ఈ భామ గురించి రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొన్ననే క్లారిటీ కూడా ఇచ్చింది. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి వస్తోన్న పుకార్లు ఇటీవల తన దృష్టికి వచ్చాయన్న ఆమె ఇప్పటివరకూ తాను కేవలం మూడు ప్రాజెక్ట్‌లకు మాత్రమే సంతకం చేశానని చెప్పుకొచ్చింది. నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు సుధీర్ బాబు .. రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

అలాంటి మగవాళ్ళే ఇష్టం
తాజాగా మగవాళ్ళ విషయంలో ఎలాంటి వారు నచ్చుతారు, ఎలాంటి వారు నచ్చరు అని అడిగితే ఆసక్తికరంగా స్పందించింది. అబద్ధం చెప్పే పురుషులు అంటే తనకు చిరాకని వాళ్ళను చూస్తే నచ్చదని చెప్పింది. అంతే కాదు మగవాళ్ళు నిజాయితీగా, ధైర్యంగా ఉండాలని, ముఖం మీదే ఏదైనా చెప్పే ధైర్యం ఉండాలి అని, అలాంటి వాళ్ళు అంటే తనకు ఇష్టం అని కృతి అన్నారు.
Recommended Video

ఓన్ డబ్బింగ్ చెప్పాలని ఉంది
ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా ఆసక్తికర సమాధానం చెప్పింది . 'మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. రాబోయే సినిమాల్లో మీరే డబ్బింగ్ చెప్తారా..?' అని ఓ ఫ్యాన్ అడగగా ...'నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలని ఉంది. చూడాలి మరి' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











