దర్శకురాలిగా బాలయ్య బ్యూటీ సరికొత్త ఎంట్రీ.. భర్తతో కలిసి..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన నటీమణులు ట్రెడిషినల్ క్యారెక్టర్స్ చేస్తే అంతగా సెట్టవ్వరనే కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. కానీ రాధిక ఆప్టే ఆ కామెంట్స్ కి ఊహించని విదంగా చెక్ పెట్టింది. బోల్డ్, ట్రెడిషినల్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
అయితే నటిగా బోర్ కొట్టేసిందో ఏమో గాని అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ గా ఉండాలని అమ్మడు మరో కొత్త తరహాలో దర్శనమివ్వనుందట. లెజెండ్, లయన్ వంటి సినిమాలతో బాలయ్య సరసన నటించిన విషయం తెలిసిందే. ఇక దర్శకురాలిగా ఈ బ్యూటీ మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది. నటిగా మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ ఇక దర్శకురాలిగా కూడా క్లిక్కవ్వాలని అనుకుంటోంది.

స్లీప్ వాకర్స్ అనే షార్ట్ ఫిల్మ్ కి రాధిక దర్శకత్వం వహిస్తోంది. షహన గోస్వామి, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఆ లఘు చిత్రానికి రాధిక ఆప్టే భర్త బెండిక్ట్ టేలర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇద్దరి భార్య భర్తల బంధం చాలా కీలకమనే కాన్సెప్ట్ తో రాధిక సినిమాను తెరకెక్కిస్తుందట. మరి ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత రాధిక ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











