నా ఫిగర్ చూసి హేళన చేయొద్దు: కంటతడి పెట్టిన విద్యాబాలన్
బాడీ ఫిగర్(శరీరాకృతి) విషయంలో విమర్శలు, వెక్కిరింపులు, అవమానాలు ఎదుర్కొన్నవారిలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఒకరు. తాజాగా ఆమె బాడీ షేమింగ్ అంశంపై రూపొందిన ఓ వీడియోలో నటించారు. ఇందులో ఆమె కంటతడి పెడుతున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
తనలాగా అవమానాలు ఎదుర్కొన్న వారిలో మనో ధైర్యం నింపడంలో భాగంగా రూపొందించిన ఈ వీడియోలో విద్యా బాలన్ తన నటనతో ఆకట్టుకున్నారు. రేడియో స్టేషన్ 'బిగ్ ఎఫ్‌ఎం' వారు 'ధున్ బదల్ కే తో దేఖో' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యాబాలన్‌తో రూపొందించిన ఈ వీడియోతో కాంపెయిన్ నిర్వహించారు.

''కభి తూ మోటి కహతా హై, కభి తో ఛోటి కహతా హై...'' అంటూ పాట పాడుతూ క్రమక్రమంగా విద్యబాలన్ ఎమోషనల్ అయ్యారు. ఇతరుల బాడీ ఫిగర్ చూసి వెక్కించడం మానండి, అలా చేయడం వల్ల వారు చాలా హర్ట్ అవుతారని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు.
'ధున్ బదల్ కే తో దేఖో' అనే రేడియో కార్యక్రమం ద్వారా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నవారు తమకు ఎదురైన అవమానకర అనుభవాలను పంచుకుంటారని, ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం సాగుతుంది.


Click it and Unblock the Notifications











