భర్తకి విడాకులు, యంగ్ హీరోతో బ్రేకప్... కొడుకు వయసున్న కుర్రాడితో హీరోయిన్ ఎఫైర్?

భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఎఫైర్లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ఎవరితో తిరుగుతున్నారో కూడా చెప్పలేని పరిస్ధితి.. బట్టలు మార్చినంత ఈజీగా లవర్లను మార్చేసే స్టార్స్ ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారు ఎందరో ఉన్నా.. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా స్పీడుతో ఉన్నారు. కుర్ర హీరోలు, హీరోయిన్లు వయసులో అలా చేశారంటే ఏదో అనుకోవచ్చు. కానీ 50 ప్లస్‌లోనూ తన ఎఫైర్స్‌, డేటింగ్స్‌, బ్రేకప్స్‌తో హల్ చల్ చేస్తున్నారు సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా. ఆమె ఎప్పుడు ఎవరితో డేటింగ్‌లో ఉంటారో? ఎవరితో బ్రేకప్ చెబుతారో? అంటూ మీడియా జనాలు ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే.

చయ్య చయ్య సాంగ్‌తో పాపులర్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో అప్పట్లో ఒక ఊపారు పంజాబీ ముద్దుగుమ్మ మలైకా అరోరా. స్పెషల్ సాంగ్స్‌తో స్టార్ స్టేటస్ అందుకుని 90వ దశకంలో మెరుపులా దూసుకొచ్చారు. అప్పట్లో బాలీవుడ్‌లో ఏ స్పెషల్ సాంగ్ అయినా మలైకా ఉండాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నా. తెలుగులోనూ 2007లో వచ్చిన మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో మెరిశారు మలైకా అరోరా.

Malaika Arora Sparks Dating Rumours over spotted With Mystery Man in Mumbai Ground

వయసు పెరిగినా తగ్గని వాడి
వయసు పెరుగుతుండటం, కొత్త అమ్మాయిలు రావడం, హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తుండటంతో మలైకా జోరు తగ్గింది. ఈ దశలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్‌లో మున్నీ బద్నాం సాంగ్‌తో మరోసారి కేక పెట్టించారు మలైకా అరోరా. ఈ సినిమా తర్వాత ఆమె తిరిగి బిజీ అయ్యారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ ఇక్కడా ఉర్రూతలూగించారు. సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే వ్యక్తిగత విషయాలు, వివాదాస్పద అంశాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు మలైకా అరోరా.

అర్బాజ్ ఖాన్‌కి విడాకులు, అర్జున్ కపూర్‌తో బ్రేకప్
తొలుత సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మలైకా అరోరా. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ విడాకులు తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఆ వెంటనే మరో షాకిచ్చారు మలైకా.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌‌తో డేటింగ్ చేసింది. అయితే అతనితోనూ బ్రేకప్ చెప్పేసింది మలైకా. ఇక గతేడాది ఐపీఎల్ సందర్భంగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరతో క్లోజ్‌గా కనిపించి షాకిచ్చారు. ఆయనతో రిలేషన్‌లో ఉందో లేదో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు ఈ వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. ఇటీవల రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన థామాలో పాయిజన్ బేబీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తనలో ఏమాత్రం వాడి వేడి తగ్గలేదని నిరూపించారు మలైకా అరోరా.

33 ఏళ్ల కుర్రాడితో మలైకా ప్రేమాయణం?
తాజాగా 52 ఏళ్ల వయసులో సినీ వర్గాలకు షాకిచ్చింది మలైకా అరోరా. ఓ కుర్రాడితో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ముంబైలోని ఎంఎంఆర్‌డీయే గ్రౌండ్స్‌‌లో గ్రామీ అవార్డ్ విన్నర్ ఎన్రిఖ్ ఇగ్లేసియాస్ నిర్వహించిన కన్సర్ట్‌లో మలైక పాల్గొన్నారు. ఇందులో తన ఫ్రెండ్స్, ఇతర సెలబ్రిటీలతో ఆమె సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వగా.. ప్రతి వీడియోలోనూ ఆమెతో పాటు ఓ కుర్రాడు కనిపించాడు. దాంతో అతను ఎవరు? మలైకాతో అంత క్లోజ్‌గా ఎందుకు ఉన్నాడు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 33 ఏళ్ల ఈ కుర్రాడితో మలైకా ప్రేమలో పడిందని.. అతని పేరు హర్ష్ మెహతా అని వార్తలు వస్తున్నాయి. ఇతనికి బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉండగా, మరికొన్ని వ్యాపారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి మలైకా నిజంగానే హర్ష్ మెహతాతో ప్రేమాయణం సాగిస్తోందా? లేక ఇది గాలివార్తేనా? అన్నది త్వరలోనే తెలియనుంది.

More from Filmibeat

Read more about: malaika arora bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X