For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆడ సింహాలే వేటాడితే మగ సింహాలెందుకన్న ఆఫీసర్..సైలెంట్ గా డబుల్ మీనింగ్ ట్వీట్ చేసిన మాళవిక మోహనన్!

  |

  నటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దళపతి విజయ్ 'మాస్టర్'లో కథానాయికగా, 'పెట్టా'లో కీలక పాత్రలో నటించింది. ఆమె తన హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తరచుగా ట్రెండింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆమె మాములుగా ట్వీట్ చేసింది. కానీ అది కాస్త డబుల్ మీనింగ్ అనిపిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఆమె ఏమని ట్వీట్ చేసింది? అది ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారింది. అనే వివరాల్లోకి వెళితే

  అలా ఎంట్రీ

  అలా ఎంట్రీ

  సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె అయిన మాళవిక ముంబైలో జన్మించారు. ముంబైలో జన్మించడంతో ఆమె అక్కడే తన చదువు పూర్తి చేసింది. తండ్రి సినిమాటోగ్రాఫర్ కావడంతో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకున్న ఆమె తండ్రికి అసిస్టెంట్ గా షూట్స్ కి వెళ్ళేది.

  అలా మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రితో పాటు పని చేస్తున్న సమయంలో ఆమెను చూసి ఇంప్రెస్ అయి మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చారు.

  వరుస అవకాశాలు

  వరుస అవకాశాలు

  ఆ సినిమా ఆమెకు పేరు తీసుకు రాకపోయినా ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చిపెట్టేలా చేసింది. అలా ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. మలయాళంలో నిర్ణాయకం, ది గ్రేట్ ఫాదర్ లాంటి చిత్రాల్లో, కన్నడంలో నన్ను మట్టు వరలక్ష్మి, తమిళంలో పెట్టా, మాస్టర్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.

  ఉండేది ఎందుకు?

  ఉండేది ఎందుకు?

  విషయం ఏమిటంటే తాజాగా ఓ ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ఒక సింహం ఫొటోను షేర్ చేస్తూ కాప్ష‌న్ పెట్టారు. అందులో.. 90 శాతం వ‌ర‌కు ఆడ‌సింహాలే వేట చేస్తాయని మ‌రి మ‌గ సింహాలు ఉండేది ఎందుకు ? అని పోస్ట్ చేశారు. అయితే అందుకు మాళ‌విక మోహ‌న‌న్ ఇచ్చిన రిప్లై వైర‌ల్‌గా మారింది.

  యాంగ్జైటీ కలిగించడానికి

  మాళ‌విక మోహ‌న‌న్ ఆ అధికారి ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. "ఆడ సింహాలకు యాంగ్జైటీ కలిగించడానికి" అని పేర్కొంది. ఈ సమాధానం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. అయితే ఇది స్ట్రైట్ ఆన్సర్ ఏ కానీ కొంత డబుల్ మీనింగ్ లాకూడా అనిపిస్తోందని అంటున్నారు నెటిజన్లు. ఆమె అభిమానుల్లో ఒకరు ''మీరు దీన్ని మీ అభిమానులకు ఎలా యాంగ్జైటీ ఇస్తారో, అలా అన్నమాట అంటూ కామెంట్ చేశారు.

  Recommended Video

  Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
  'రాజా డీలక్స్'లో

  'రాజా డీలక్స్'లో

  మొత్తం మీద వార్తల్లో ఎలా ఉండాలో ఈ భామకు బాగా తెలుసని విశ్లేషకులు అంటున్నారు. మాళవిక మోహనన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ధనుష్ యొక్క 'మారన్' అలాగే హిందీలోని 'యుధ్రా'లో కూడా భాగం అవనుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి. 'రాజా డీలక్స్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మాళవికా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

  English summary
  Malavika mohanan Double Meaning Tweet about lions gone viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X