వాళ్లకి మా శరీరమే కావాలి.. ఆ నొప్పి భరించలేక.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినీనటులకు ముఖ్యంగా హీరోయిన్లకు అందమే పెట్టుబడి. అందంగా కనిపించినంత కాలమే హీరోయిన్లకు అవకాశాలు క్యూకడతాయి. ఏమాత్రం తేడా వచ్చినాసరే జీవితం తలక్రిందులు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. కెరీర్‌ మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా ఉండాలంటే అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. ఇందుకోసమే సైజ్ జీరోలు, కఠినమైన డైట్లను ఫాలో అవుతుంటారు. అలా కాకుండా శరీరాన్ని గాలికి వదిలేస్తే అడ్రస్ లేకుండా పోతారు. ఈ విషయాన్ని పలువురు హీరోయిన్ల జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు.

హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్
అక్కడితో ఆగకుండా ఎంతోమంది హీరోయిన్లు బాడీ షేమింగ్‌కు గురయ్యారు. నిత్యామీనన్, విద్యాబాలన్, నివేదా థామస్ సహా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు బాడీ షేమింగ్ బారినపడ్డవారే. అయినప్పటికీ అన్నింటిని తట్టుకుని నిలబడి తమ జీవితాలను వారు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకే వస్తారు సినీ నటి మంజిమా మోహన్. ఆమెకు ఏం జరిగింది? అనూహ్యంగా సినీరంగానికి ఎందుకు దూరమయ్యారు? ఈ వివరాల్లోకి వెళితే..

Manjima Mohan Opens up about body shaming comments on her

బాలనటి టూ హీరోయిన్
కేరళలోని తిరువనంతపురానికి చెందిన మంజిమా మోహన్ తొలుత బాలనడిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. అనంతరం 2015లో ఓరు వడక్కన్ సెల్ఫీ అనే సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2016లో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తర్వాత నందమూరి తారక రామారావు బయోగ్రఫిలో నారా భువనేశ్వరిగా నటించారు మంజిమ. అయితే రెండేళ్లుగా ఆమె ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. 2023లో చివరిసారిగా విశ్వక్‌సేన్ తదితరులు నటించిన బూ అనే సినిమాలో నటించారు మంజిమ.

సినిమాలకు దూరంగా మంజిమ
కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మంజిమా మోహన్. ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన దేవరట్టం సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లిపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. గౌతమ్ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదని, అలాగే పెళ్లికి ముందే మంజిమ గర్భవతి అని రకరకాల కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇవి మంజిమ దృష్టికి రావడంతో ఆమె ఎంతో బాధపడ్డారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ మంజిమ బాగా బరువు పెరిగిపోవడంతో ఆమెపై బాడీ షేమింగ్ ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఓ ఇంటర్యూలో మంజిమ మోహన్ స్పందించారు.

బరువు తప్పించి ఏం కనిపించదా
బరువు తగ్గితే నాకు అదనంగా కొన్ని సినిమాలలో అవకాశాలు రావొచ్చు.. కానీ జీవితానికి అదే ముఖ్యం కాదు. హీరోయిన్లను విమర్శించేవారికి శరీరం తప్పించి ఏం కనిపించదా అని మంజిమ మోహన్ ప్రశ్నించారు. సినీరంగాన్ని పక్కనపెడితే.. నా బరువు ఎవరికీ సమస్య కాదని తేల్చిచెప్పారు. సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమేనని, కానీ తన ఆశయాలు వెండితెరను మించి ఎన్నో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అయితే విపరీతంగా బరువు పెరగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజిమ పేర్కొన్నారు. ఇక ఈ నొప్పిని తట్టుకునే ఓపిక నాకు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే డాక్టర్లను సంప్రదించి బరువు తగ్గాలని అనుకున్నానని, అవసరమైతే సర్జరీ కూడా చేయించుకునేందుకు సిద్ధపడ్డానని మంజిమ గుర్తుచేసుకున్నారు. తనకు పీసీఓడీ సమస్య ఉందని కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉందన్నారు. అయితే బరువు ఎక్కువ ఉన్నప్పటికీ మిగతా అనారోగ్య సమస్యలు తనను చుట్టుముట్టలేదని, అలాగే నటీనటులకు నటన తప్పించి రూపం, బరువు కాదని మంజిమ మోహన్ తేల్చిచెప్పారు.

More from Filmibeat

Read more about: manjima mohan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X