Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Nabha Natesh: ఇస్మార్ట్ భామ నభా నటేష్ కి యాక్సిడెంట్.. రెండు చోట్ల ఎముక విరగడంతో అలా!
బ్యూటిఫుల్ నభా నటేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేనికి జోడిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది ఈ గ్లామర్ బ్యూటి. ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా.. ఆకట్టుకోవడమే కాకుండా యూత్ గుండెల్లో ముద్ర పడిపోయేలా గ్లామర్ ను ఒలకబోసింది. తర్వాత అడపదడపా సినిమాలు చేసినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఇన్ని రోజులు నభా నటేష్ కు అవకాశాలు రాకపోవడంతోనే సోషల్ మీడియాలో హాట్ గా పోజులు ఇస్తుందని అంతా భావించారు. కానీ తాజాగా తను సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇస్మార్ట్ శంకర్ మూవీతో..
ఇటీవల కాలంలో సాధారణ అమ్మాయిలతోపాటు చాలా మంది స్టార్ హీరోయిన్స్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా హాట్ స్టిల్స్ తో దర్శనమిస్తున్నారు. ఈ కోవలోకే చెందుతుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నభా నటేష్. నిత్యం హాట్ ఫోటోలతో రోజురోజుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

గ్లామర్ తో డామినేట్ చేసేందుకు..
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదట్లో చాలా నార్మల్గానే సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ చిత్ర పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్స్ నుంచి పోటీ ఎక్కువ కావడంతో నభా కూడా గ్లామర్ తో డామినేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో ఈజీగా ట్రెండ్ అయ్యాయి.

ఓవర్ డోస్ లో గ్లామర్ ట్రీట్..
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ చేసిన పాత్రకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆమె తెలంగాణ యాసలో బాడీ లాంగ్వేజ్ చో ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా గ్లామర్ ట్రీట్ కూడా చాలా గట్టిగానే ఇచ్చింది. దీంతో వెంటనే ఈ బ్యూటీపై మిగతా దర్శక నిర్మాతల దృష్టి కూడా పడింది.

సక్సెస్ కానీ నభా సినిమాలు..
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ కు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు అమ్మడికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. రవితేజ సరసన డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి కొత్త సినిమాలు థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదలయ్యాయి. కానీ అవేవి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తర్వాత నితిన్ తో చేసిన మాస్ట్రో సినిమా డైరెక్ట్ గా OTTలో విడుదలైన విషయం తెలిసిందే.

అందుకే అందాల ఆరబోత..
తమన్నా-నితిన్ నటించిన ఈ మాస్ట్రో సినిమా కూడా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో నభా నటేష్ కు తర్వాత అవకాశాలు రావడం కరువైంది. ఎలాగైన మళ్లీ సినిమా అవకాశాలు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో గ్లామర్ ఆరబోతకు స్వీకారం చుట్టిందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ నభా నటేష్ కు సినిమాలకు రాకపోవడానికి, ఆమె అంగీకరించకపోవడానికి అసలు కారణం ఏంటో తాజాగా రివీల్ చేసింది.
క్లిష్టమైన పరిస్థితి..
"గత సంవత్సరం కాలంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నాను. నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో నా ఎడమ చేతి భుజానికి తీవ్ర గాయమైంది. రెండు చోట్ల ఎముక విరగడంతో సర్జరీలు జరిగాయి. దీంతో మానసికంగా, శారీరకంగా చాలా ఆవేదనను అనుభవించాను. ఈ సమయంలోనే సినిమాలకు దూరంగా ఉండిపోయాను. అయితే ఇప్పుడు ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇంతకుముందు కంటే మరింతగా ఉత్సాహంగా ఉన్నాను" అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చిన గ్లామరస్ బ్యూటి నభా నటేష్ భుజంపై గాయాలు ఉన్న ఫొటో షేర్ చేసింది.