For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా కుర్చీ లాక్కొనే ప్రయత్నం.. నాకే ఎసరు పెట్టే ప్లాన్.. నందమూరి బాలకృష్ణ కామెంట్స్ వైరల్

  |

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌లో రాబోతున్న తదుపరి చిత్రం ఊర్వశివో రాక్షసివో. అల్లు శిరీష్ తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసివో" ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..

  కొత్త ఒరవడికి తగినట్టుగా

  కొత్త ఒరవడికి తగినట్టుగా


  నందమూరి ఫ్యాన్స్‌కు, అల్లు అభిమానులకు ధన్యవాదాలు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ప్రముఖులకు శుభాభివందనాలు. కొత్త ఒరవడికి తగినట్టుగా సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న నూతన దర్శకులకు, కళాభిమానులు, కళాపోషకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకొంటున్నాను. ఊర్వశివో.. రాక్షసివో సినిమా సినిమాను రూపొందిస్తున్న అల్లు అరవింద్‌కు ధన్యవాదాలు అని బాలకృష్ణ అన్నారు.

  టాక్‌ షోలకే అమ్మ మొగుడు

  టాక్‌ షోలకే అమ్మ మొగుడు


  అల్లు అరవింద్ కుటుంబంతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీ పరంగా ఉన్న సంబంధాలతో టాక్ షోలకే అమ్మ మొగుడు లాంటి షో అన్ స్టాపబుల్ ఆహా ఓటీటీలో చేశాం. అయితే 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. అప్పుడు నా వయసు 14 ఏళ్లు.. అప్పటి నుంచి ఈ సంస్థను ఏ రేంజ్‌కు తీసుకెళ్లాడో మీకు తెలుసు అని బాలకృష్ణ అన్నారు.

   యువత సహజీవనంతో

  యువత సహజీవనంతో


  ఊర్వశివో.. రాక్షసివో సినిమా విషయానికి వస్తే.. ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ప్రతీ మనిషిలో ఒక కోణం ఉంటుంది. మహిళను కార్యేశు దాసి.. శయనేషు రంభ.. భోజ్యూషఉ మాత.. రూపేశు లక్ష్మీ.. క్షమయా ధరత్రి అంటారు. కాలం, తరాలతోపాటు అభిరుచులు మారుతున్నాయి. యువతలో సహజీవనం, అఫైర్లు లాంటివి కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ఏం చూపించారో.. సినిమా చూస్తే గానీ తెలియదు అని బాలకృష్ణ అన్నారు.

   అల్లు శిరీష్‌ను అన్ స్టాపబుల్‌కు పిలిచి...

  అల్లు శిరీష్‌ను అన్ స్టాపబుల్‌కు పిలిచి...


  ఊర్వశివో.. రాక్షసివో సినిమా ట్రైలర్‌ను చూస్తే.. మంచి మాస్ మసాలాను దట్టించారు. అయితే వ్యక్తిగత జీవితంలో కూడా అల్లు శిరీష్ అలాంటివాడేనా అనే విషయం తెలుసుకోవాలంటే.. అన్ స్టాపబుల్ టాక్ షోకు పిలిపించి అన్ని విషయాలు ఆరా తీస్తాను. గెస్టుగా పిలిపించి వివరాలన్నీ కూపీ లాగుతాను అని బాలకృష్ణ అన్నారు.

   టాక్ షోకు ఎసరు పెట్టే ప్రయత్నం

  టాక్ షోకు ఎసరు పెట్టే ప్రయత్నం


  ఇక అన్ స్టాపబుల్‌ టాక్ షోకు అల్లు శిరీష్ ఎసరు పెట్టేందుకు ప్రయత్నించాడు. నేను చేస్తున్న హోస్ట్‌పై పదవిపై అల్లు శిరీష్ కన్నేశాడు. నా కుర్చీని లాగేసుకోవాలని ప్లాన్ చేశాడు. అలాంటి విషయాలన్నీ టాక్ షోలో తేల్చుకొందాం. ఇది పక్కన పెట్టేసి.. ఊర్వశివో రాక్షసివో సినిమా ఘన విజయం సాధించాలి. సాంకేతిక నిపుణులకు, నటీనటులకు మంచి పేరు రావాలి అని బాలకృష్ణ తెలిపారు.

   ట్రైలర్ చాలా కలర్‌ఫుల్‌గా

  ట్రైలర్ చాలా కలర్‌ఫుల్‌గా


  ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది. నాకు ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కానీ నా అభిమానులకు ఇష్టం లేని పాత్రల్లో నటించకూడదనేది నా అభిప్రాయం. ఎవరి ఇమేజ్‌కు తగినట్టు.. వారు తమ పాత్రలను పోషించాలి. నటుడు.. నేను చేయలేనిది ఏమీ లేదని ఫీల్ అవ్వద్దు.. నటన అంటే నవ్వడం.. అరవడం కాదు.. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి అని బాలకృష్ణ అన్నారు.

  English summary
  Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in Urban romantic drama, titled 'Urvasivo Rakshasivo'. The film is releasing worldwide on November 4th. And the team is busy with the promotions. The team held a grand pre-release event, which Nata Simham Nandamuri Balakrishna attended. At the event, the filmmakers amazed the audience by releasing a theatrical trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X