నయనతార ఫైటర్.. ఆమెను కలవడం ఓ మ్యాజిక్.. కత్రినా కైఫ్ పొగడ్తల వర్షం

దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్ నయనతార. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. తమ అందం, అభినయంతో కోట్లాది మందిని ఆకట్టుకొంటున్న ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు కలిశారు. వీరు కలిసింది సినిమా కోసం కాదు. ఓ వాణిజ్య ప్రకటన షూట్ కలిసిన బ్యూటీలు మనసువిప్పి మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా నయనతారపై కత్రినా కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక కత్రినా ఎలా పొగడ్తలతో ముంచెత్తిందంటే..

Recommended Video

Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara
 ముంబైలో నయనతారతో కత్రినా కైఫ్

ముంబైలో నయనతారతో కత్రినా కైఫ్

నయనతార, కత్రినా కైఫ్ తాజాగా కే బ్యూటీ అనే ప్రొడక్ట్ కోసం షూట్ చేశారు. ఈ షూట్ సందర్భంగా వారిద్దరూ కలిసి సంతోషంలో మునిగిపోయారు. ఈ సమయంలో నయనతారతో బిజీగా ముచ్చటిస్తూ అనేక విషయాలు చర్చించుకొన్నట్టు వీడియోలో కనిపించింది. నయనతారతో పంచుకొన్న అనుభూతులకు సంబంధించిన వీడియోను కత్రినా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

నయనతారకు బిగ్ థ్యాంక్స్

నయనతారకు బిగ్ థ్యాంక్స్

నయనతార గురించి కత్రినా కైఫ్ స్పందిస్తూ.. ఎంతో బిజీ షెడ్యూల్‌ను కూడా పక్కన పెట్టి కే బ్యూటీ క్యాంపెయిన్ కోసం ముంబై వచ్చారు. నయనను కలిసిన తర్వాత ఆమె గొప్పతనం మరింత తెలిసింది. ఎన్నో రోజులు ఎదురుచూస్తూ... ఆమెను కలువాలనుకొంటున్న కోరిక తీరింది. ఆమె నా తరఫు నుంచి బిగ్‌ థ్యాంక్స్ అని కత్రినా కైఫ్ పేర్కొన్నారు.

 నయనతార స్టన్నింగ్

నయనతార స్టన్నింగ్

నయనతారతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడుతూ.. నయనతార చూస్తే స్టన్నింగ్‌గా అనిపించింది. మానసికంగా ధృడమైన మహిళగా కనిపించారు. ఆమెలో ఓ ఫైటర్‌ను చూశాను. నటన పట్ల అంకితభావం నన్ను బాగా ఆకట్టుకొన్నది. చిన్న వయసులో పరిశ్రమలోకి ప్రవేశించడం వల్ల అద్భుతమైన పరిణితి కనిపించింది. పనిపట్ల చూపే శ్రద్ద నన్ను బాగా ఆకట్టుకొన్నది అని కత్రినా కైఫ్ తెలిపారు.

నయనను కలిసిన రోజు మ్యాజిక్ డే

నయనతారను సెట్‌లో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నన్ను నేను చూసుకొన్నానా? అనే ఫీలింగ్ కలిగిందని నా టీమ్‌తో చెప్పాను. ఎవరైనా నీ గురించి ఎదుటి వ్యక్తి ఏదైనా గొప్పగా గానీ.. మరేదైనా గానీ చెబితే.. వాళ్లు ఎందుకు చెబుతున్నారో అనే విషయాన్ని గ్రహించాలి. నయనతారను కలిసిన రోజు నా జీవితంలో ఓ మ్యాజిక్ డే అని కత్రినా కైఫ్ పొగడ్తల వర్షం కురిపించారు.

 కత్రినా కైఫ్ కెరీర్ ఇలా

కత్రినా కైఫ్ కెరీర్ ఇలా

కత్రినాకైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ విడుదల కావాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇంకా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజ్ మీడియం సినిమాలో ఓ ప్రత్యేకపాటలో నర్తించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X