For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా లెవల్లో నయన్ పెళ్లి.. హక్కులు కొనేసిన ఓటీటీ దిగ్గజం.. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో?

  |

  గత కొద్ది రోజులుగా నయన తార వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె జూన్ 9వ తేదీన తన చిరకాల ప్రియుడు విగ్నేష్ శివన్ తో 7 అడుగులు వేయబోతోంది. అయితే ఈ వివాహానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె వివాహాన్ని స్ట్రీమింగ్ చేయడం కోసం ఒక ఓటీటీ దిగ్గజం భారీ రేటు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  లేడీ సూపర్ స్టార్

  లేడీ సూపర్ స్టార్

  మలయాళ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార అతి కొద్ది కాలంలోనే మలయాళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తమిళ, తెలుగు సినిమాలలో వరుస హిట్స్ అందుకున్న ఇప్పుడు సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటోంది. గతంలో పలువురితో ప్రేమాయణం నడిపిన ఆమె వారందరినీ పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు. కానీ ఆ ప్రేమలు-పెళ్ళిళ్ళ వరకు వెళ్ళలేదు.

  చేతులెత్తేసిన క్రమంలో

  చేతులెత్తేసిన క్రమంలో


  అయితే గత కొద్ది కాలంగా ఆమె తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమ లో ఉంది. వీరిద్దరి వివాహం జరిగిపోయింది అంటూ కూడా ప్రచారాలు జరిగాయి కానీ అదైతే నిజం కాదు. అయితే ఎట్టకేలకు వీరి వివాహం జూన్ 9వ తేదీన జరగబోతోంది. తొలుత వీరు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 150 మందికి ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసిన క్రమంలో ఇలా కుదరదని భావించి దగ్గరలోని మహాబలిపురంలో వివాహ వేడుకను నిరాడంబరంగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

   లీక్ కాకుండా

  లీక్ కాకుండా


  తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన ఈ జంట తమ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రచారం జరుగుతోంది. అది ఏమిటి అంటే వీరి వివాహాన్ని మొత్తం కూడా దర్శకుడు గౌతంమీనన్ చిత్రీకరించే అవకాశం ఉందని అంటున్నారు. వీరి వివాహ స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుందని భారీ రేటు చెల్లించి వారి వివాహానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయిందని అంటున్నారు.

  స్ట్రీమింగ్ చేయాలని

  స్ట్రీమింగ్ చేయాలని

  తద్వారా తమ వారి పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకోసమే గౌతమ్ మీనన్ తో కూడా భారీ రేటు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం జరిగినప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయ్యాయి.

  విజయాన్ని సాధించి

  విజయాన్ని సాధించి

  అయితే నయనతార పెళ్లి విషయంలో కూడా అది నిజమే అవుతుందా లేక ప్రచారం వరకే మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కన్మణి రాంబో ఖతీజా అనే సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత జంటగా నటించారు.

  English summary
  As per trusted sources Nayanthara and Vignesh Shivan wedding will be exclusively shot and premiered in NETFLIX. Gautham Menon to take care of direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X