Don't Miss!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Nayanthara: తొలిసారిగా అక్కడ రిలీజవుతున్న నయనతార చిత్రం.. ఎప్పుడంటే?
కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించిన మలయాళ కుట్టి నయనతార మనస్సినక్కరే సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. విభిన్నమైన సినిమాల్లో అలరించిన నయనతార సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. దాదాపుగా 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వెలుగొందుతోన్న నయనతార మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది. త్వరలో జవాన్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంటర్ కానుంది. అయితే ఆ సినిమా కంటే ముందే నయనతార చిత్రం ఆ సినీ ఇండస్ట్రీలో విడుదల కానుంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

నచ్చిన కథ దొరికితే..
నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్‌గా స్టార్డమ్ సంపాందించుకుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోన్న హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. నచ్చిన కథ దొరికితే వాటిని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఈ భార్యాభర్తలు.

బాలీవుడ్ నటుడి కీలక పాత్ర..
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న నయన తార పెళ్లి తర్వాత పూర్తిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది నయన్.
మాయ, గేమ్ ఓవర్ సినిమాల దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నయనతారతోపాటు వాన సినిమా హీరో వినయ్ రాయ్, సత్యరాజ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు.

ఇంటర్వెల్ లేకుండా..
ఇటీవల కార్తికేయ 2లో కనిపించిన అనుపమ్ ఖేర్ సుమారు 15 ఏళ్ల తర్వాత తమిళ చిత్రంలో నటించారు. ఈ కనెక్ట్ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేయనుంది. తమిళంలో ఇప్పటికే కనెక్ట్ ప్రీమియర్ షో పడగా మంచి టాక్ వస్తోంది. 99 నిమిషాల నిడివి ఉన్న ఈ హారర్ మూవీని ఇంటర్వెల్ లేకుండా ఉండనుందని ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది.

మొట్టమొదటిసారిగా హిందీలో..
లేడీ సూపర్ స్టార్ నయనతారకు దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. నార్త్ లో కూడా నయన్ కు ఫ్యాన్స్ ఉండటంతో ఆమె క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కనెక్ట్ సినిమాను హిందీలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. మొట్టమొదటిసారిగా హిందీలో విడుదల అవుతున్న నయనతార సినిమా ఇది. జవాన్ కంటే ముందుగానే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో కలిసి నటించిన ఈ సినిమా హిందీలో రిలీజ్ కానుంది. దీంతో నయన్ నార్త్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అన్నమాట.

ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలని..
"నయనతార గొప్ప నటి. ఆమె సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. అయితే నయన్ తన నార్త్ ఇండియన్ అభిమానుల కోసం కూడా సినిమాలు అందించే సమయం ఆసన్నమైంది. నయనతారకు ఇండియావ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అది నేను పర్సనల్ గా కూడా చూశాను. మా ఇద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన మాయ చిత్రం అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
కాబట్టి, ఇప్పుడు ఈ కనెక్ట్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలనే ఉద్దేశంతో హిందీలో కూడా విడుదల చేయాలని అనుకున్నాం" అని డైరెక్టర్ అశ్విన్ శరవణన్ తెలిపారు. ఈ సినిమాను హిందీలో డిసెంబర్ 30 విడుదల చేయనున్నారు.