For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే, తనలోని అన్ని రకాల టాలెంట్లను చూపించి సత్తా చాటింది. దీంతో శృతి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను సైతం అందుకుంటోంది.

  ఇలా చాలా కాలంగా దక్షిణాది భాషల్లో హవాను చూపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శృతి హాసన్ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను వింత ప్రశ్న అడిగాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   చిన్న వయసులోనే కెరీర్ మొదలు

  చిన్న వయసులోనే కెరీర్ మొదలు

  సినిమాల మీద ఉన్న ఆసక్తితో శృతి హాసన్ చిన్న వయసులోనే సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అలా ఆ తర్వాత కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇక, 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ చిత్రంలో కీలకమైన పాత్రను చేసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో హీరోయిన్‌గానూ పరిచయం అయింది.

  Bigg Boss OTT: షోలోకి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ.. రెండోసారి ఆఫర్ పట్టేసిన టాలీవుడ్ హీరో

   తెలుగులో స్టార్‌గా... రీఎంట్రీ ఇచ్చి

  తెలుగులో స్టార్‌గా... రీఎంట్రీ ఇచ్చి

  శృతి హాసన్ టాలీవుడ్‌లోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరి సినిమాల్లోనూ నటించింది. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుంది. అలా గత ఏడాది 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ నటించింది. ఇక, ఇప్పుడు 'సలార్‌'తో పాటు బాలయ్యతో నటిస్తోంది.

   విదేశీయుడితో బ్రేకప్.. మరో లవర్

  విదేశీయుడితో బ్రేకప్.. మరో లవర్

  కెరీర్ పరంగా యమ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా శృతి అతడితో విడిపోయింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోని ఈ బ్యూటీ శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో ప్రేమాయణం సాగిస్తోంది.

  బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్

  పెళ్లికి ముందే జంటగా కలిసుంటూ

  పెళ్లికి ముందే జంటగా కలిసుంటూ

  శృతి హాసన్ ప్రస్తుతం కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ హాట్ బ్యూటీ శాంతను హజారికాతో ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ రచ్చ రచ్చ చేస్తోన్న విషయం తెలిసిందే.

   అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

  సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

  నీ బాడీలో ఏ పార్టులు అంటే ఇష్టం

  నీ బాడీలో ఏ పార్టులు అంటే ఇష్టం

  శృతి హాసన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి ఆమె సమాధానం చెప్పింది. మరీ ముఖ్యంగా పలువురు ఔత్సాహికులు ఆమె పర్సనల్ విషయాలూ అడిగారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మీ బాడీలో ఏ పార్టులంటే ఇష్టం' అంటూ శృతి హాసన్‌ను ప్రశ్నించాడు.

  Hansika Motwani Speech | My Name Is Shruti Teaser | Filmibeat Telugu
  ఆ రెండే ఇష్టమని చెప్పిన బ్యూటీ

  ఆ రెండే ఇష్టమని చెప్పిన బ్యూటీ

  సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ షాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో దానిపై స్పందిస్తూ.. 'నా బాడీలో నాకు నచ్చినవి చాలానే ఉన్నాయి. అన్నింటికంటే నాకు నా బ్రెయిన్ అంటే ఇష్టం. ఆ తర్వాత నా హార్ట్ అంటే ఇష్టం. అంతే ఆ రెండు అంటేనే ఇష్టం' అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఈ ప్రశ్నకు చాలా మంది వేరే జవాబులు వస్తాయని అనుకున్నా ఇలా షాకిచ్చిందామె.

  English summary
  Shruti Hassan Recently Conduct Question and Answer Session in Instagram. Netizen Ask Unexpected Question in This Chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion