For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్తతో నిహారిక కొణిదెల రొమాంటిక్‌గా.. స్పెషల్ డే రోజున ఎమోషనల్ పోస్టు..పిక్స్ వైరల్!

  |

  భర్త చైతన్య జేవీతో మెగా డాటర్ నిహారిక కొణిదెల వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతున్నది. తమ మధ్య ఎలాంటి హ్యాపీ మూమెంట్ చోటుచేసుకొన్న నిహారిక తన అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకొంటున్నారు. తాజాగా తన భర్త చైతన్య బర్త్ డే రోజున ఓ లవ్లీ పిక్, మెసేజ్‌లో ఎమోషనల్ అయ్యారు. నిహారిక చేసిన పోస్టు ఏమిటంటే..

  Jennifer Lopez birthday Photos.. ప్రియుడితో ఘాటుగా లిప్‌లాక్.. 52 ఏళ్ల వయసులో బికినీలో అందాల వడ్డిస్తున్న బ్యూటీ

  ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా

  ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా

  నిహారిక కొణిదెల భర్త చైతన్య జేవీ జూలై 26 తేదీన తన బర్త్ డేను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకొన్నారు. చైతూ బర్త్ డేను నిహారిక ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘమైన మెసేజ్‌ను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

  భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ రానా షూట్ ఫోటో వైరల్..

  నా హృదయాన్ని ఉత్తేజ పరుస్తూ

  నా హృదయాన్ని ఉత్తేజ పరుస్తూ

  నా ప్రియమైన భార్తకు హ్యాపీ బర్త్ డే. నీవు మూవీస్ ఎంపిక చేసుకొనే విధానం. అలాగే ఇంటిలో వంట ప్రయోగాలు చేయడం, ప్రేమతో కాఫీని కలపడం నా మైండ్‌, నా హృదయాన్ని ఉత్తేజపరుస్తాయి. అలాగే అర్ధరాత్రి స్నాక్ తినడం, నీవు ఏర్పాటు చేసే థీమ్ పార్టీలు నాకు ఎంతో ఇష్టం. అలాగే చిలిపిగా నీవు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ప్రశాంతంగా ఉండే తీరు నన్ను ఎంతో ఆకట్టుకొంటుంది. అలాగే నీ సహనం, పరిస్థితుల పట్ల నీ అవగాహన చూస్తే.. నా భార్తకు ఇన్ని మంచి క్వాలిటీ ఉన్నాయే అని ఆశ్చర్య పోతుంటాను అని తన మెసేజ్‌లో నిహారిక తెలిపారు.

  Vadinamma : శిల్ప ఇంటికి నాని ఫ్యామిలీ.. మరో స్కెచ్ వేసిన దమయంతి!

   ఆకాశమంత ప్రేమను పంచుతా

  ఆకాశమంత ప్రేమను పంచుతా

  నా జీవితానికి సరిపోయేంతగా అనుభూతులను పంచుతున్నావు. నీ మనసు కంటే గొప్పగా ఈ లోకంలో ఏమీ లేదు. నాపై అంచంచలమైన ప్రేమను కురిపిస్తున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా చెచూకు ఆకాశమంత ప్రేమ నీ కోసం పంచుతాను అని ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

  గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ

  నిహారికకు చైతన్య లవ్లీ మెసేజ్

  నిహారికకు చైతన్య లవ్లీ మెసేజ్

  ఇన్స్‌టాగ్రామ్‌లో నిహారిక చేసిన పోస్టుపై చైతన్య స్పందించారు. థ్యాంక్స్ ఫర్ లవ్.. నా బర్త్ డేను మరింత స్పెషల్‌గా, మరిచిపోలేని విధంగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చైతన్య ఓ పోస్టు పెట్టారు. అలా వారిద్దరూ తమ ప్రేమను, అనురాగాన్ని పంచుకొంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేశారు. వీరిద్దరి పోస్టులకు అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చైతన్యకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.

  Janaki Kalaganaledu Today Promo: జానకి గుట్టు బయటపడే సమయం ఆసన్నమైంది.. మల్లిక చేతిలో కీలక ఆధారం!

  నిహారిక ప్రేమ, పెళ్లి

  నిహారిక ప్రేమ, పెళ్లి

  నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... నటిగా, హోస్ట్‌గా కొనసాగుతున్న సమయంలో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన జరిగింది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా కేవలం కుటుంబ వేడుకగా జరిగింది. అలా ఒక్కడైన నిహారిక దంపతులు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారనే ఇన్స్‌టాగ్రామ్ పోస్టులు చూస్తే తెలుస్తుంది.

  English summary
  Niharika Konidela romontic photo, Emotional post on Chaitanya Jonnalagadda birthday. Happy birthday, husband ! May you continue to blow my mind with your weird movie selection, your monthly cooking experiments, your love for coffee, your midnight snacking,your dedication towards theme parties, your silly reactions, your super calm personality, your patience and finally your amazing husband qualities! A sweet soul like you deserves nothing but the best in life. Thank you so much for showering me with all the love! Love you loads, my chechuuu!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X