Niharika Konidela: ఆ విషయంలో ఎవడేమన్నా ఐ డోంట్ కేర్ .. కొణెదెల నిహారిక మాస్ రియాక్షన్

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. నటుడిగా, యాంకర్‌గా, ఇప్పుడు నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా డాటర్ సినీ ఇండస్ట్రీలో చురుకుగా వ్యవహరిస్తోంది. కొణిదెల నాగబాబు కూతురిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నిహారిక, మొదట యాంకర్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తరువాత "ఒక మనసు" సినిమాతో హీరోయిన్‌గా పరిచమైంది. అయితే అనుకున్నంత సక్సెస్ రాకున్నా.. మంచి గుర్తింపు వచ్చింది నిహారికకు. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, నిహారిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

తరువాత నిహారిక వెబ్ సిరీస్‌ల వైపు మళ్లింది. ఈ క్రమంలో ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, హలో వరల్డ్, మ్యాడ్ హౌస్ వంటి ప్రాజెక్టులతో నిర్మాతగా తన సత్తా చాటింది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై క్వాలిటీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత ఏడాది "కమిటీ కుర్రాళ్లు" సినిమాతో తన సత్తా చాటింది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో మెగా డాటర్ నిహారికకు నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రస్తుతం నిహారిక సంగీత్ శోభన్ హీరోగా, మానస శర్మ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా యువతను ఆకట్టుకునే కంటెంట్‌తో రూపొందుతోందని టాలీవుడ్ టాక్. నిర్మాతగా నిహారికకు ఇది మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Niharika Konidela s Bold Reply to Trolls Focus on Reality Not Negativity

మెగా డాటర్ కెరీర్ పరంగా సక్సెస్ పుల్ జర్నీని కొనసాగిస్తోన్న... తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొంటుంది. వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన.. ఆ బంధం కొంతకాలానికే ముగిసింది. విడాకుల తర్వాత ఆమె చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆ అనుభవాన్ని తన బలంగా మార్చుకుంది. తాజాగా నిహారిక తనపై వచ్చిన ట్రోలింగ్, విమర్శలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికను "మీపై ఎవరైనా ట్రోలింగ్ చేస్తే, విమర్శిస్తే ఎలా రియాక్ట్ అవుతారు?" అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం సింపుల్ గానూ, సూటిగానూ, కానీ బలమైన మెసేజ్ ఇచ్చేలా ఉంది. నిహారిక మాట్లాడుతూ, "ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినా నేను ఓకే అని సైలెంట్‌గా ఉంటా. బయట ఏం జరుగుతుందో ? ఎవరు ఏమంటారో ? నేను అంతగా పట్టించుకోను. ఎవరైనా ఎక్కువగా నన్ను పొగిడినా కూడా నేను ఆ ఎమోషన్‌లోకి వెళ్లను. ఎందుకంటే నాకు నా రియాలిటీ తెలుసు. బయట చాలా మంది ఇతరులను డౌన్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను వాటిని సీరియస్‌గా తీసుకోను." అన్నారు.

అంతేకాకుండా ఆమె తన లైఫ్ ప్రైవేట్ సర్కిల్ గురించి కూడా చెప్పింది. "నా ప్రపంచం చాలా చిన్నది. మమ్మీ, డాడీ, నా బ్రదర్ - ఇవే నా వరల్డ్‌. అలాగే నా ఫ్రెండ్స్ గ్రూప్ కూడా చాలా చిన్నది. వాళ్లు ఎప్పుడూ నన్ను నెగటివ్‌గా మాట్లాడరు. వాళ్లే నాకు సపోర్ట్ సిస్టమ్. వాళ్లు తప్ప ఎవరు ఏమన్నా, అది నా వెంట్రుకతో సమానం. 'నో ఫరక్' అని నేనంటా" అని స్మైల్తో చెప్పింది నిహారిక. నిహారిక ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, పాజిటివ్ ఆలోచనలను మెచ్చుకుంటున్నారు. జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా సైలెంట్‌గా ముందుకు సాగడం, తన పనితోనే సమాధానం ఇవ్వడం నిహారిక స్టైల్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నిహారిక మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానుల్లో కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X