నిక్కి తంబోలిని వెంటాడిన దురదృష్టం.. ‘చితక్కొట్టుడు’ హీరోయిన్‌కు చేదు అనుభవం!

దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ హిందీ ముగిసింది. ఎన్నో వివాదాలు, గొడవల మధ్య బిగ్‌బాస్ 14 పూర్తయింది. ఈ రియాలిటీ షోలో రుబీనా దిలాయిక్ విజేతగా నిలిస్తే.. రాహుల్ వైద్య రన్నరప్‌గా నిలిచారు. అయితే ఈ షోలో సంచలన రీతిలో కామెంట్లు చేస్తూ హంగామా చేసిన నిక్కి తంబోలి టైటిల్‌ను జార విడుచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

Recommended Video

Chikati Gadilo Chithakotudu Movie Press Meet | Filmibeat Telugu
టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా

టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా


చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో నిక్కి తంబోలి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. ఆ చిత్రంలో ఆమె నటించి తీరు, హాట్ హాట్‌గా కనిపించిన తీరు అందర్ని ఆకట్టుకొన్నది. శృంగారం తారగా నిక్కి తంబోలి టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసింది. చీకటి గదిలో చితక్కొట్టుడు తర్వాత నిక్కి తంబోలి తన దృష్టి అంతా బాలీవుడ్, మోడలింగ్‌పై పెట్టడంతో టాలీవుడ్‌కు దూరమైంది.

ఫస్ట్ కంటెస్టెంట్‌గా సల్మాన్ ఖాన్‌తో

ఫస్ట్ కంటెస్టెంట్‌గా సల్మాన్ ఖాన్‌తో

ఇక బిగ్‌బాస్ 14లో తొలి కంటెస్టెంట్‌గా వేదికపై మెరిసింది. ఏకంగా సల్మాన్‌ ఖాన్‌ను బుట్టలో వేసేందుకు ప్రయత్నించింది. ఓ దశలో అల్లరి పిల్ల అంటూ సల్మాన్ ఖాన్ కామెంట్ చేశారు. ఇక 140 రోజులకుపైగా సాగిన ఈ షోలో అఫైర్లు, కామెంట్లతో రచ్చ రచ్చ చేసింది. జాన్ కుమార్ సానుతో అఫైర్ స్పెషల్‌గా మారింది. అలాగే ఇంటి సభ్యులు ఆమె ప్రవర్తనపై అనేక మార్లు కంప్లయింట్ చేశారు.

తొలి ఫైనలిస్టుగా రికార్డు

తొలి ఫైనలిస్టుగా రికార్డు


బిగ్‌బాస్ షో నుంచి అర్ధాంతంరంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే మళ్లీ ఇంటిలోకి అడుగుపెట్టింది. 14వ సీజన్‌లో తన సత్తాను ప్రదర్శిస్తూ.. తొలి ఫైనలిస్టుగా రికార్డుకెక్కింది. అయితే అందరూ టైటిల్ గెలుస్తుందా అనే ఆసక్తితో ఫైనల్‌పై దృష్టిపెట్టారు. అయితే ఆమెను వెనక్కి నెట్టి రుబీనా, రాహుల్ వైద్య టాప్ పొజీషన్‌లో నిలిచారు.

మూడోస్థానంతో సరిపెట్టుకొన్న నిక్కి తంబోలి

మూడోస్థానంతో సరిపెట్టుకొన్న నిక్కి తంబోలి

ఇక బిగ్‌బాస్ 14 సీజన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన నిక్కి తంబోలి మూడో స్థానంతో సరిపెట్టుకొన్నది. సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షోలో ఆమె ఉపయోగించిన భాష కారణంగానే ఓట్లు సంపాదించుకోలేకపోయిందనే వాదన తెరపైకి వచ్చింది. ఈ షోలో తనకు అత్యంత క్లోజ్‌గా ఉన్న రుబీనాకు టైటిల్ దక్కడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X