For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ బికినీ రచ్చ.. ఆ ఇద్దరి మధ్యలో నిల్చుని.. బాబోయ్ మరీ ఇలా ఏంటీ!

  |

  తెలుగులో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నటి నిక్కీ తంబోలి. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాంచన 3 సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది నిక్కీ. ఇక ఇటీవల హిందీలో పూర్తయిన 'బిగ్ బాస్ 14' సీజన్ లొ నిక్కీ తంబోలి రన్నరప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నిక్కీ తాజాగా బీచ్ లో బికినీతో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

  మొన్నే సోదరుడిని కోల్పోయి

  మొన్నే సోదరుడిని కోల్పోయి

  బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి కొద్ది రోజుల క్రితం సోదరుడు జతిన్ ను కరోనా బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వయసు 29 సంవత్సరాలే. తన సోదరుడి మరణం తరువాత కొద్ది రోజులకే ఈ బ్యూటీ దక్షిణాఫ్రికాకు 'కహట్రాన్ కే ఖిలాడి 11' అనే స్టంట్ బేస్డ్ రియాలిటీ షో షూటింగ్ కోసం వెళ్ళింది. తన సహ పోటీదారులైన అర్జున్ బిజ్లానీ, రాహుల్ వైద్య, సనా మక్బూల్, అస్తా గిల్ తదితరులతో ఈ షో లో పాల్గొనడానికి వెళ్ళింది.

  ట్రోలింగ్ బారిన పడి

  ట్రోలింగ్ బారిన పడి


  అయితే సోదరుడు మరణించి రోజులు గడవక ముందే ప్రొఫెషనల్‌గా ఫీల్ అయి ఆ షెడ్యూల్ క్యాన్సిల్ కాకుండా ఉన్నందుకు చాలా మంది నిక్కీని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం సోదరుడు చనిపోయిన కొద్ది రోజులకే 'ఎంజాయ్' చేస్తోందని ఆమెను ట్రోల్ చేశారు. దీంతో ట్రోలింగ్ పై ఫైర్ అయ్యి దాని మీద క్లారిటీ ఇచ్చింది.

  కరోనా బారిన పడి

  కరోనా బారిన పడి


  ఇక అంతకు ముందే కొవిడ్‌-19 బారిన పడి ఆమె కోలుకుంది. ఆ తరువాత కొవిడ్‌-19తో బాధపడుతున్న వారికి ప్లాస్మా దానం చేస్తానని కూడా ఈ భామ వెల్లడించింది. తన బ్లడ్‌ గ్రూప్‌ 'O+' ప్లాస్మాను కొనుగోలు చేయలేని పేద రోగులు, ఆర్థిక సామర్థ్యం లేనివారికి ప్రభుత్వ ఆసుపత్రిలో దానం చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొంది. అయితే ఆ తరువాత ఆమె సోదరుడు మరణించడంతో ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు.

  బ్లాక్ బికినీ ధరించి

  బ్లాక్ బికినీ ధరించి


  ఇక నిక్కి తంబోలి ప్రస్తుతం రాబోయే యాక్షన్-రియాలిటీ షో, ఖత్రోం కే ఖిలాడీ 11 షూట్ కోసం కేప్ టౌన్ లో ఉన్నారు. బుధవారం, ఆమె తన అభిమానులకు మంచి హాట్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ బికినీ ధరించిన ఫోటో షేర్ చేసిన ఆమె తన 'సొంత దేశీ బాయ్స్' వరుణ్ సూద్, విశాల్ ఆదిత్య సింగ్ లతో కలిసి ఫోజులిచ్చింది. ఈ ముగ్గురూ బీచ్ లో నడుస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్ క్లిక్ మానిపించారు. నిక్కి తంబోలి బ్లాక్ బికినీలో ఉండగా విశాల్ మరియు వరుణ్ షర్ట్‌లెస్‌గా షార్ట్ లు వేసుకుని కనిపించారు.

  ఎలిమినేషన్ ఎవరంటే


  అంతకుముందు, నిక్కి బ్లూ మోనోకినిలో ఉన్న హాట్ పిక్చర్స్ కూడా పంచుకుంది. ఇక తాజా నివేదికల ప్రకారం ఖత్రోం కే ఖిలాడీ 11 షో మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, నిక్కి, అనుష్క సేన్ మరియు విశాల్ ఆదిత్య సింగ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నారని అంటున్నారు. దీంతో షోలో విశాల్ ప్రయాణం ముగిసిందని తెలుస్తోంది.

  English summary
  Bigg Boss 14 fame Nikki Tamboli is currently in Cape Town. She went there to shoot for the upcoming action-reality show, Khatron Ke Khiladi 11. She shared her bold and hot picture sporting a black bikini. In the photo, she poses along with her ‘own desi boys’ Varun Sood and Vishal Aditya Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X