For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతడు నాకు చాలా క్లోజ్.. పెళ్లి చేసుకోమని వెంటపడ్డారు.. నిత్యమీనన్

  |

  దక్షిణాదిలో అద్బుతమైన పాత్రలతో, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్న నిత్యామీనన్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. గతేడాది మంగళ్ యాన్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్య మీనన్ తాజాగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించారు. తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన బ్రీత్ సీజన్ 2లో వారిద్దరి కలిసి నటించిన సంగతి తెలిసిందే. బ్రీత్ సీజన్ 2 ప్రమోషన్ సందర్భంగా నిత్య మీనన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

  దుల్కర్ సల్మాన్‌తో ప్రత్యేకమైన బాండ్

  దుల్కర్ సల్మాన్‌తో ప్రత్యేకమైన బాండ్

  సినిమా పరిశ్రమలో నాకు చాలా హీరోలతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది. కానీ దుల్కర్ సల్మాన్‌తో ప్రత్యేకమైన బాండ్ ఉంది. ఓకే బంగారం సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన పరిచయం చాలా క్లోజ్‌గా మారింది. అతడు పక్కాగా ఫ్యామిలీ మ్యాన్. కుటుంబానికి అత్యంత విలువనిచ్చే గుణం నాకు బాగా నచ్చింది. నా వైవాహిక జీవితం చాలా బాగుందని పదే పదే చెబుతుంటారు అని నిత్య మీనన్ పేర్కొన్నారు.

  పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని

  పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని

  మా మధ్య చాలా సార్లు పెళ్లి ప్రస్తావన, వైవాహిక జీవితం గురించి చర్చ జరుగుతుంది. ఆ టాపిక్ వచ్చిన ప్రతీసారి నన్ను పెళ్లి చేసుకోమని పోరుపెడుతాడు. పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని చెబతాడు. పెళ్లి తర్వాత నా జీవితం చూడు ఎంత చక్కగా ఉందో.. నీకు అలాంటి జీవితం ఉండాలని నేను కోరుకొంటున్నానని దుల్కర్ అంటుంటాడు అని నిత్య మీనన్ తెలిపారు.

  మణిరత్నం సార్‌తో పనిచేయడం

  మణిరత్నం సార్‌తో పనిచేయడం

  ఒకే బంగారం చిత్రం నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా. మణిరత్నం సార్ చాలా చక్కగా నన్ను చూపించారు. ఆ సినిమా షూటింగ్ గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా సీన్లు ఎడిట్ చేయలేదు. ఎలా షూట్ చేశారో అలానే పెట్టారు. చాలా సహజంగా వచ్చాయి. నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్ర అని నిత్య మీనన్ చెప్పారు.

  బ్రీత్‌లో అభిషేక్ బచ్చన్‌తో

  బ్రీత్‌లో అభిషేక్ బచ్చన్‌తో

  ఇక బ్రీత్‌లో అభిషేక్ బచ్చన్‌తో నటించడం మరో గొప్ప అనుభూతి. ఓటీటీ నా ప్రతిభకు మరింత గుర్తింపునిస్తుంది. బ్రీత్‌లో నా నటనకు మంచి ప్రశంసలు దక్కుతాయని ఆశాభావంతో ఉన్నాను. ఓకే బంగారం చిత్రంలో నా నటనను చూసి దర్శకుడు మయాంక్ శర్మ పిలిచి అబా పాత్రను ఇచ్చారు. బ్రీట్ సీజన్ 2 కంటెంట్ అందరికీ నచ్చుతుంది అని నిత్య మీనన్ పేర్కొన్నారు.

  IFFI 2019 : Rashmika Mandanna About How She Deal With Trolls
  నిత్య మీనన్ కెరీర్ గురించి

  నిత్య మీనన్ కెరీర్ గురించి

  నిత్య మీనన్ కెరీర్ విషయానికి వస్తే.. తమిళంలో జయలలిత బయోపిక్‌తోపాటు ధనుష్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెలంగాణ నేపథ్యంగా తెరకెక్కి చిత్రంతోపాటు ఓ సెటైరిక్ కామెడీతో చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నాను. నా స్నేహితుడు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అమెజాన్ కోసం తెలుగులో ఓ వెబ్ సిరీస్‌కూడా చేస్తున్నాను అని నిత్య మీనన్ చెప్పారు.

  English summary
  Actress Nitya Menen is coming first time with web series called Breathe. Abhishek Bachchan is in lead role with Nitya. She shares information about the bonding of Dulquer Salmaan. She said, forced me to tie the knot and settle down.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X