For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వు వర్జినేనా: నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న.. అమ్మడి సమాధానం ఇదే.!

By Manoj Kumar P
|

నివేదా థామస్.. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటున్న హీరోయిన్. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపును సంపాదించుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన చేసిన 'జెంటిల్‌మన్' అనే సినిమాలో ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం ఆ ఒక్క సినిమానే కాదు.. నివేదా నటించిన అన్ని సినిమాల్లో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇలాంటి పరిస్థితిల్లో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.

రజనీకాంత్ నుంచి పిలుపు

రజనీకాంత్ నుంచి పిలుపు

నివేదా థామస్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది. అందుకే మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులో ఆమె రజనీకాంత్ కూతురి పాత్రను పోషిస్తోంది. నివేదా పాత్ర సినిమాకు ఏంతో ముఖ్యమని తెలుస్తోంది. అందుకే ఈమెను తీసుకున్నారన్న టాక్ ఉంది.

నివేదాకు డిమాండ్ ఎక్కువే

నివేదాకు డిమాండ్ ఎక్కువే

దక్షిణాది భాషల్లో ఈమె నటన గురించి చాలా మందికి తెలుసు. కాబట్టే ఎన్నో అవకాశాలు వరస పెట్టి మరీ వస్తున్నాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘వీ' అనే సినిమాలోనూ నివేదా నటిస్తోంది. ఈ సినిమాను ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అతిథి రావు కూడా నటిస్తోంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

నివేదా థామస్ తన ఫ్యాన్స్ కోసం నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అలాగే, తన సినీ కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

అదే కొంప ముంచింది

అదే కొంప ముంచింది

సోషల్ మీడియా అనేది ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో ఏదో ఒక రాద్దాంతం జరుగుతూనే ఉంటోంది. తాజాగా నివేదా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసింది. ఈ సమయంలో ఓ నెటిజన్ ఆమెను ‘నువ్వు వర్జినేనా' అని ప్రశ్న అడిగాడు. అంతేకాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని కూడా ప్రశ్నించాడు.

 అదిరిపోయే సమాధానం

అదిరిపోయే సమాధానం

తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన సదరు నెటిజన్‌కు నివేదా అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘నేను ఇలాంటి చెత్త ప్రశ్నలను పట్టించుకోను. ఒకసారి ఇలా అడిగే ముందు మనం మనుషి లాగే ప్రవర్తిస్తున్నామా అని మనసులో అనుకోవాలి. అయినా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంత మర్యాదను కూడా చూపించాలి' అని నెటిజన్‌పై ఫైర్ అయింది.

English summary
Nivetha Thomas is an Indian film actress who appears in Malayalam, Telugu, Tamil language films. She is best known for Ninnu Kori and Gentleman. Thomas made her debut with the 2008 Malayalam film Veruthe Oru Bharya, for which she won the Kerala State Film Award for Best Child Artist.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more